Wednesday, April 17, 2024

వ్యవసాయ వ్యతిరేక విధానాలు పిఎం మోడీ మానుకోవాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Modi govt should avoid anti-agricultural policies

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉద్యానసాగు సగటులో తెలంగాణ టాప్ లో ఉందని, మామిడి విస్తీర్ణంలో 3.21 లక్షల ఎకరాలతో 8వ స్థానంలో ఉండడంతో పాటు ఉత్పత్తిలో దేశంలో  తెలంగాణ నాలుగవ స్థానంలో ఉంది.  మిరపసాగులో 3.88 లక్షల ఎకరాలతో 6.51 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలో రెండోస్థానంలో ఉంది. పసుపుసాగులో  86 వేల ఎకరాలలో 2.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో 5వ స్థానంలో తెలంగాణ ఉంది. కూరగాయల ఉత్పాదకతలో జాతీయ సగటు హెక్టారుకు 18.79 మెట్రిక్ టన్నులుకాగా తెలంగాణ సగటు 24.77 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఆయిల్ పామ్ సాగులో 20 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యంగా ఈ ఏడాది చివరి వరకు విస్తీర్ణంలో అగ్రస్థానానికి చేరుకోనుందన్నారు.  ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఇప్పటికే 3.61 లక్షల మెట్రిక్ టన్నులతో దేశంలో రెండోస్థానంలో ఉందని నిరంజన్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, ఉచిత కరంటు, సూక్ష్మ సేద్యానికి సబ్సిడీ, ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహంతో తెలంగాణ రైతాంగం అద్భుతాలు సాధిస్తుందని ప్రశంసించారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ప్రకారం వైవిధ్యమైన పంటల సాగుతో మరిన్ని సాధించే అవకాశం ఉంది. ప్రజల పోషక భద్రత పెంచడానికి ఉద్యాన సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించనుంది. రాబోయే కాలంలో రానున్న పంట ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని కోహెడ మార్కెట్ లో 200 ఎకరాలలో అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. ఎగుమతులకు అనుగుణంగా వేపర్ హీట్ ట్రీట్ మెంట్ ప్లాంటు, ఇర్రేడియేషన్ ప్లాంటు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయనున్నారు. పోషక అవసరాలకు అనుగుణంగా నెలవారీ డిమాండ్ మేరకు కూరగాయల సాగుకు చర్యలు చేపట్టనున్నారు. డిమాండ్ కు తగిన విధంగా రైతులను మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు అనుకూల విధానాలను అవలంబించాలని నిరంజన్ రెడ్డి సూచించారు. పేరుకే కేంద్రం వ్యవసాయ మౌళిక సదుపాయాల నిధిని ప్రకటించినా అది ఆచరణాత్మకంగా లేదని మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని బిజెపి మేనిఫెస్టోలో హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్రం పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏండ్లు పైబడిన రైతులకు ఫించన్ ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారని, కేంద్రం విధానాలు, నినాదాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News