Wednesday, April 24, 2024

ప్రముఖులకు మోడీ ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు రుణ మాఫీ చేసింది: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో మోడీ ప్రభుత్వం తమ ప్రముఖ స్నేహితులకు రూ.7,77,800 కోట్ల వరకు రుణమాఫీ చేసిందని ఆమేరకు రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా శనివారం ట్వీట్ల ద్వారా విమర్శించారు. బ్యాంకు రుణనివేదికను ఉదహరిస్తూ 2014 నుంచి రుణమాఫీ, బ్యాంకుల నిరర్ధక ఆస్తులు, మొండి బకాయిలు ఇవన్నీ కలిపి రూ.7,77,800 కోట్ల వరకు రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. ఆమేరకు లబ్ధి పొందిన వారి పేర్లు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రూ.9,10,800 కోట్ల వరకు పెరగ్గా, మొండి బకాయిలు భారీగా రూ. 16,88,000 కోట్ల వరకు పెరిగాయని, ప్రైవేట్ బ్యాంకుల రుణ పరపతి వృద్ధి రూ.12 శాతం దిగజారగా, ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల పరపతి వృద్ధి రూ.4 శాతం వరకు దిగజారిందని ఆయన వివరించారు. తమ మిత్రులైన ప్రముఖులకు అంత మొత్తంలో రుణమాఫీ చేసినప్పుడు రైతులకు ఎందుకు ఆ విధమైన వెసులుబాటు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. బ్యాంకుల్లోని ప్రజాధనానికి భద్రత కల్పించే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.

Modi Govt waive Rs.7,77,800 Cr loans to crony friend: Cong

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News