Saturday, April 20, 2024

అన్నీ అన్‌లాక్‌లే

- Advertisement -
- Advertisement -

Modi has made it clear that there will be no Lockdowns

 

దేశంలో ఇక లాక్‌డౌన్‌లు ఉండవని స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై స్పష్టత కోరిన సిఎం కెసిఆర్‌కు జవాబు
కరోనా అదుపులోనే ఉందని
ప్రధానికి చెప్పిన ముఖ్యమంత్రి
మీ హమాలీలను పంపండి, మా సిఎస్ బీహారేనని అక్కడి సిఎం నితీష్‌ను కోరిన సిఎం
దేశమంతా ఒక్క తాటిపై నిలుద్దాం
రక్షణపై రాజీ వద్దు, తెలంగాణ అండగా ఉంటుంది చైనాకు గట్టి సమాధానం చెప్పాల్సిందే సిఎంల సమావేశంలో ప్రధానికి స్పష్టం చేసిన కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి స్పందించారు. దేశంలో లాక్ డౌన్‌ల దశ ముగిసి, అన్‌లాక్‌ల దశ ప్రారంభమయిందని ప్రధాన మం త్రి స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మో డీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. ప్ర స్తుతం దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారేమోననే ప్రచారం పెద్దఎత్తున జరుగుతున్నదని మీరు ( ప్రధానమంత్రి) మీడియాతో మాట్లాడుతున్నారనగానే లాక్ డౌన్ ప్రకటన చేస్తారని అనుకుంటున్నారని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. దేశంలో అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడకుండా ప్రధాన మంత్రి లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరు అని తాను చెబుతున్నానని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై ప్రజల్లో జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని సిఎం కెసిఆర్ సూచించారు.

సిఎం కెసిఆర్ చేసిన విజ్ఞప్తిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్పందిస్తూ, దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే నాలు గు దశల లాక్ డౌన్ ముగిసిందన్నారు. ప్రస్తుతం అన్ లాక్ 1.0 నడుస్తున్నదని, అన్‌లాక్ 2.0 ఎ లా అమలు చేయాలనే విషయంపై మనమం తా చర్చించుకోవాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశా రు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభు త్వం చేపడుతున్న చర్యలను ప్రధాని నరేంద్రమోడీకి ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వివరించారు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నదన్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో కరోనా ప్రస్తుతం అదుపులోనేఉన్నదన్నారు. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదు అవుతున్నదని ప్రధాని దృష్టికి సిఎం కెసిఆర్ తీసుకెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం తమకుందన్నారు. తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ కూడా వ్యాప్తి నివారణకు గట్టిగా పనిచేస్తున్నామన్నారు.

కొద్ది రోజుల్లోనే వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తుందనే విశ్వాసం తనకుందన్నారు. రాష్ట్రంలో మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నదన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెల్లడానికి సిద్ధమవుతున్నారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. దేశమంతా ఒక్కటేనని… ఎక్కడి వారు ఎక్కడికైనా వెళ్ళి పనిచేసుకునే అవకాశం ఉండాలని సిఎం కెసిఆర్ అన్నారు. బీహార్ నుంచి హామాలీలు తెలంగాణకు రావడానికి సిద్ధమవుతున్నారని అని సిఎం చెప్పారు. బీహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి కెసిఆర్ సరదాగా స్పందించారు. “నితీష్ గారు, మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సిఎస్ కూడా మీ బీహార్ రాష్ట్రానికి చెందిన వారే. దయచేసి పంపించండి” అని కెసిఆర్ అన్నారు.

దేశరక్షణ విషయంలో రాజీపడొద్దు

దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. భారత సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ప్రస్తుతం దేశమంతా ఒక్కతాటిపై నిలవాల్సన అవసరం ఆసన్నమైందన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో భారత్ – చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని కెసిఆర్ ప్రస్తావించారు. చైనాగానీ మరే దేశంగానీ భారత్ సార్వభౌమత్వం విషయంలో వేలు పడితే, తప్పక ప్రతిఘటించాలన్నారు. అందుకు ప్రతిగా తగిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంలో ప్రధాన మంత్రితో పాటు అందరు ముఖ్యమంత్రులు లడాఖ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో చనిపోయిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News