Friday, March 29, 2024

రెచ్చగొడితే బద్‌లా తప్పదు

- Advertisement -
- Advertisement -

Modi indirect warning to China

సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక
గుంపులతోనే సమస్య
వైరస్ పట్ల పారాహుషార్
రాష్ట్రాల సిఎంలతో పిఎం
ముగిసిన సమీక్షల ఘట్టం

న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. కరోనా వైరస్‌పై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ దశలో ప్రధాని గాల్వన్ లోయలో జరిగిన ఘటనపై స్పందించారు. ఘర్షణను భారతదేశం కోరుకోదని, అయితే కవ్వింపు చర్యలకు దిగితే తగు జవాబు ఉంటుందని, దెబ్బకు దెబ్బ తీస్తామని స్పష్టం చేశారు. లద్దాఖ్ ఘటనలోప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు నివాళిగా తొలుత ప్రధాని రెండు నిమిషాల మౌనం పాటించారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృథాకాబోవని, వారి త్యాగాలను, వారి సేవలను దేశం ఎల్లవేళలా తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటుందని అన్నారు.

ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలు ఎనలేనివని, వారిని సర్వదా గుర్తుంచుకుంటామని జాతికి హామీ ఇస్తున్నట్లు తెలిపారు. దేశ ఐక్యతా, సార్వభౌమాధికారం విషయంలో రాజీపడేది లేదని , శాంతి పథంలోనే భారతదేశం వెళ్లుతుందని, అయితే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. భారతదేశం ఎవరినీ కావాలని రెచ్చగొట్టడం చేయలేదని, పలు సందర్భాలలో దేశ సార్వభౌమాధికారం పరిరక్షించుకునే దిశలోనే సాగుతూ వచ్చామని, ఈ శక్తి సామర్థ్యం భారత్‌కు నిండుగా ఉందన్నారు. త్యాగాలు దేశ లక్షణం అని, ధైర్యసాహసాలు జాతికి వన్నె తెచ్చిన గుణాలు అని ప్రధాని తెలిపారు. అన్ని అంశాలపై విభేదాలు ఉంటాయని, అయితే విభేదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాలకు దారితీయరాదనేదే భారతదేశ నిర్థిష్ట అభిప్రాయం అని ప్రధాని తేల్చిచెప్పారు. సిఎంలతో సమీక్ష దశలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.

సందర్భాలలో దేశ సార్వభౌమాధికారం పరిరక్షించుకునే దిశలోనే సాగుతూ వచ్చామ ని, ఈ శక్తి సామర్థం భారత్‌కు నిండుగా ఉందన్నారు. త్యాగాలు దేశ లక్షణం అని, ధైర్యసాహసాలు జాతికి వన్నె తెచ్చిన గుణాలు అని ప్రధా ని తెలిపారు. అన్ని అంశాలపై విభేదాలు ఉం టాయని, అయితే విభేదాలు ఎట్టి పరిస్థితుల్లో నూ వివాదాలకు దారితీయరాదనేదే భారతదేశ నిర్థిష్ట అభిప్రాయం అని ప్రధాని తేల్చిచెప్పారు. సిఎంలతో సమీక్ష దశలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.

గుంపులుగా తిరగడంతోనే సమస్య

భౌతికదూరం పాటించకపోవడం,రోడ్లపై ఎక్కువగా జనం వాహనాలపై తిరగడం వంటివాటితో కొన్ని నగరాలు ఇప్పుడు వైరస్ కేంద్రాలు అయ్యాయని ప్రధాని తెలిపారు. జనసంచారం ఎక్కువ కావడంతోనే తలెత్తిన వైరస్ తీవ్రత ఆయా రాష్ట్రాలకు పెను సవాలుగా మారిందన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ జనరల్స్‌తో రెండు రోజుల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలో అన్‌లాక్ దశలను ఆవిష్కరించాలని ప్రధాని సంకల్పించారు. ప్రస్తుత అన్‌లాక్ 1.0 తరువాతి పరిణామాలపై సమీక్షించారు. వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో దేశ ప్రజలంతా క్రమశిక్షణతో అంకితభావంతో వ్యవహరించారని , ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా తీవ్రత లేకపోవడం ఇక్కడ తీసుకున్న చర్యల పట్ల అమితాసక్తిని పెంచిందన్నారు. వివిధ రాష్ట్రాల సిఎంలు ఈ సందర్భంగా వైరస్ కట్టడి విషయంలో ప్రధాని చేపట్టిన చర్యలు, తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. ఆయన ఈ విషయంలో సముచిత నాయకత్వ శైలిని ప్రదర్శించారని పేర్కొన్నారు.

వైరస్‌ను అరికట్టేందుకు తమతమ రాష్ట్రాలలో చేపట్టిన చర్యల గురించి ప్రధానికి వివరించారు. బుధవారం ప్రధాని మోడీ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్నాటక, బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి నుంచి తీసుకున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ ఉండదని స్పష్టమైన సంకేతాలు వెలువరించారు. కోవిడ్‌పై పోరు సమసిపోయిందని అనుకోరాదని, దీనిని సమగ్రరీతిలో చేపడుతూనే అన్‌లాక్‌కు వెళ్లాల్సి ఉందన్నారు. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో వైరస్ తీవ్రత ఉన్న రాష్ట్రాలలో పరిస్థితి, తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎంల నుంచి తెలుసుకున్నారు. తరుకరోనా వైరస్ తీవ్రత అయితే ఉండనే ఉందని, అయితే క్రమేపీ మనం ఇప్పుడు కోలుకునే దశకు చేరుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

ప్రస్తుతం వైరస్ రికవరీ రేటు పెరిగిందని అయితే కొత్త కేసులు కూడా వస్తున్నాయని, దీనిని సమన్వయపర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మరోసారి లాక్‌డౌన్ ఉంటుందనే ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు. ముఖ్యమంత్రులు ఈ వదంతుల గురించి పట్టించుకోవద్దని, వైరస్‌పై పోరు గురించే దృష్టి సారించాలని కోరారు. కొన్ని పెద్ద రాష్ట్రాలలోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. జనసంఖ్య ఎక్కువగా ఉండే నగరాలలో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున దీనిని అరికట్టేందుకు ముఖ్యమంత్రులు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సి ఉందన్నారు. ఆరోగ్య వ్యవస్థను ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ, టెస్టుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. వైద్య ఏర్పాట్లను విస్తృతపర్చుకోవల్సి ఉందని, వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి సరైన టెస్టులు జరిగేలా ఉంటే క్రమేపీ వైరస్ బెడద తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ సడలింపులతో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ వచ్చిందని, ఉత్పత్తి పెరిగిందని, డిమాండ్ ఇనుమడిస్తోందని అన్నారు. అయితే వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసేదిశలో పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతూనే అన్‌లాక్‌కు సిద్ధం కావల్సి ఉందన్నారు.

19న ప్రధాని అఖిలపక్ష భేటీ

చైనా సరిహద్దుల్లో ఘర్షణపై ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. శుక్రవారం అఖిలపక్ష భేటీ వీడియో కాన్ఫరెన్స్ పద్థతిలో జరుగుతుంది. అఖిలపక్ష వర్చువల్ భేటీకి ప్రధాని పిలుపు ఇచ్చిన విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం తెలిపింది. గల్వాన్ వ్యాలీలో హింసాత్మక ఘర్షణల వివరాలను ప్రభుత్వం బయటకు తెలియచేయడం లేదని, వీటిని వివరించాల్సి ఉందని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని భేటీకి రంగం సిద్ధం అయింది. 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు వర్చువల్ భేటీ జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News