Thursday, April 25, 2024

కోట్లు ఉన్నా చేయూత లేదు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ పుణ్యమా అని చాలా మంది క్రికెటర్లు కోటీశ్వర్లుగా మారారు. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కలిగిన వారిలో భారత క్రికెటర్లే అత్యధికులు ఉన్నారు. ఇక, కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ క్రీడాకారులు తమ వంతు సహాయంగా కోట్లాది రూపాయలను విరాళాలుగా ఇస్తున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజాలు మెస్సి, రొనాల్డో, టెన్నిస్ స్టార్లు నాదల్, జకోవిచ్, ఫెదరర్ తదితరులు తమ తమ దేశాల ప్రజల కోసం కోట్లాది రూపాయలను విరాళాల రూపంలో అందిస్తున్నారు. చివరికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ వంటి పేద దేశాలకు చెందిన క్రీడాకారులు కూడా తమవంతు సహకారంగా పెద్ద మొత్తంలోనే ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు. అయితే ఎంతో సంపన్నలుగా పేరు తెచ్చుకున్న భారత క్రికెటర్లు మాత్రం కరోనా బాధితుల సహాయం కోసం ముందుకు రావడం లేదు.

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, క్రికెటర్లు హార్దిక్ పాండ్య, ధావన్, అశ్విన్, జడేజా, భువనేశ్వర్, బుమ్రా తదితర స్టార్‌లు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి విరాళాలు ప్రకటించక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కేవలం 50 లక్షల రూపాయల చొప్పున మాత్రమే విరాళాలు ప్రకటించారు. మరోవైపు మహ్మద్ షమి ఏకంగా ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చుకుని పెద్ద మనసును చాటుకున్నాడు. జహీర్ ఖాన్, మునాఫ్ తదితరులు కూడా భారీ మొత్తంలో విరాళాలు అందించారు. అయితే వందల కోట్ల ఆదాయం కలిగిన కోహ్లి, రోహిత్, ధోనీ తదితరులు మాత్రం కరోనా బాధితుల సహాయం కోసం ముందుకు రాక పోవడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు కూడా కేవలం పది లక్షల రూపాయలను మాత్రమే విరాళంగా ప్రకటించింది. ఇక, కోట్లాది రూపాయల వేతనాన్ని అందుకుంటున్న భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి కూఆ ఇప్పటి వరకు ఎలాంటి విరాళాన్ని ప్రకటించలేదు. ఇటు భారత ప్రధాని కరోనా మహమ్మరి నివారణకు ప్రముఖులు తమవంతు ఆర్థిక సహాయం అందించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. కోట్లాది రూపాయలు ఉన్నా క్రికెటర్లు మాత్రం అరకొర విరాళాలతో సరి పెట్టుకుంటున్నారు.

Mohammed Shami Donates Rs 5 Cr for Corona Relief

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News