Friday, April 26, 2024

భారీ మల్టీస్టారర్‌లో మోహన్ లాల్?

- Advertisement -
- Advertisement -

Mohanlal

 

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, – రామ్‌చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. కాగా తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను సంప్రదించినట్లు తెలిసింది. మోహన్ లాల్ కూడా ఆ ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించారట. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన క్రేజీ బ్యూటీ అలియా భట్, అలాగే ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా మోరిస్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇతర కీలక పాత్రల కోసం విదేశీ నటులు రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీని తీసుకున్నారు. మరో ప్రత్యేక పాత్రలో అజేయ్ దేవగణ్ నటిస్తున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం… పైగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

 

Mohanlal in RRR movie
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News