Home తాజా వార్తలు మలయాళ నటుడు రిజబావా కన్నుమూత

మలయాళ నటుడు రిజబావా కన్నుమూత

Mollywood Actor Rizabawa Passed Awayతిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటుడు రిజబావా(55) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాదితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కొచ్చిలోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 90వ దశకంలో మలయాళ సినిమా పరిశ్రమలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 50 సినిమాల్లో ఆయన నటించారు. 1990లో షాజీ కైలాస్ దర్శకత్వంలో వచ్చిన ‘డాక్టర్ పశుపతి’ సినిమాతో ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఆయన రాణించారు. చివరిగా రిజబావా మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘వన్’ సినిమాలో  న‌టించారు.  రిజబావాకు మలయాళ సినీ ప్రముఖలతో పాటు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.