Home జాతీయ వార్తలు బస్సులో పట్టుబడిన రూ.3. 47కోట్ల నగదు

బస్సులో పట్టుబడిన రూ.3. 47కోట్ల నగదు

Money Seized in Tamil Naduతమిళనాడు : ధర్మపురి జిల్లాలో ఒక బస్సులో దుండగులు వదిలిపెట్టిన రూ.3.47 కోట్ల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ఇంత పెద్ద మొత్తం ఉన్నట్టు గుర్తించిన  కండక్టర్‌ ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. ఏడు సంచుల్లో ఉన్న రూ.3.47 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కండక్టర్‌ సెల్వరాజ్‌ నిజాయితీని అధికారులు అభినందించారు. ఆ నగదు తమదేనంటూ ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో  ఓటర్లకు పంచేందుకే ఈ నగదును తరలిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Money Seized in Tamil Nadu on Thursday