ఢిల్లీ: మంగోలియా అధ్యక్షుడు ఖాల్ట్‌మాగ్గిన్ బట్టూల్గా ఇండియా పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీకి వచ్చారు. భారత్ లో ఆయనన ఐదు రోజుల పాటు పర్యటిస్తారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఖాల్ట్ మాగ్గిన్ బట్టూల్గా భారత ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. శుక్రవారం ఆయన నరేంద్రమోడీతో భేటీ అవుతారు. ఈ క్రమంలో మంగోలియాలోని గండన్ మొనాస్టరీలో బుద్ద విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ, ఖాల్ట్‌మాగ్గిన్ బట్టూల్గాలు ఆవిష్కరిస్తారు. భారత్ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలిస్తారు.
#WATCH Delhi: President of Mongolia, Khaltmaagiin Battulga arrives in India. He is on a 5-day state visit to India during which he will also meet President Ram Nath Kovind and Prime Minister Narendra Modi. pic.twitter.com/nuFmwPn3lW
— ANI (@ANI) September 19, 2019