Tuesday, September 26, 2023

కోతుల బెడద నుంచి విముక్తి……

- Advertisement -
- Advertisement -

కోతులను పట్టేందుకు ప్రత్యేక బోన్ కెజ్‌లను ఏర్పాట చేసిన జిడబ్ల్యుఎంసి

 

మనతెలంగాణ/కార్పొరేషన్: ప్రజలకు కోతుల బెడద నుండి విముక్తి కలిగించుటకు గాను జిడబ్ల్యుఎంసి ఆధ్వర్యంలో మహానగర వ్యాప్తంగా ప్రత్యేక బోన్ కెజ్‌ల ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బోన్‌కెజ్‌ల ఏర్పాటు చేసి 22 కోతులను పట్టుకున్నారు. నగరంలో ఐదు ప్రత్యేక బోన్‌కేజ్‌లను అధిక కోతుల బెడద ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసి దశల వారిగా కోతులను పట్టి అటవీ ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని బల్దియా వెటర్నరి అధికారి గోపాల్‌రావు అన్నారు. గురువారం ఎక్సైజ్‌కాలనీలో బోన్‌కెజ్‌ల ద్వారా కోతులను పట్టుతున్న తీరును బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్ పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News