Home దునియా పురాణ గాథ: ధర్మవ్యాధుడి కథ

పురాణ గాథ: ధర్మవ్యాధుడి కథ

Dharmavyadhudu

ఏ పనీ అసహ్యమైంది కాదు, అపవిత్రమైంది అంతకంటే కాదు. చేసే ఏ పనైనా తగిన పని అనుకుంటే బాగా చెయ్యగలం అంటాడు. ఏ పనిచేసినా దాన్నే భగవంతుడికి సమర్పణ చేసి చేయాలంటాడు. ఏ పనినైనా మనసుకు తీసుకోకుండా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నిబద్ధతతో చేస్తున్నాను అనుకోవాలి అంటాడు.

మహాభారతంలోని వానప్రస్థపర్వంలో మార్కండేయ ముని యుధిష్టరునికి చెప్పిన కథ. ధర్మవ్యాధుడు(మాంసం అమ్ముకునే వ్యక్తి) ఒక బ్రాహ్మణుడుకి చెప్పిన నీతులు. అడవికి వెళ్లి ఒక సన్యాసి చాలాకాలం తపస్సు చేస్తాడు. ఒకరోజు కౌశికుడనే మహాముని చెట్టు కింద కూర్చొని ఉంటాడు. చెట్టుపైన ఒక కాకి, కొంగ దెబ్బలాడుకోవడంలో ఎండుటాకులు కొన్ని సన్యాసి నెత్తిమీద పడతాయి. దాంతో ఆగ్రహించిన ఆ ముని తన తపఃశక్తితో ఆ కాకి, కొంగలను తనకంటే చూపుతో భస్మం చేస్తాడు.

దాంతో గర్వం తలకెక్కుతుంది అతనికి. ఆ తర్వాత ఒకరోజు భిక్షకోసం ఒక ఇంటికి వెళతాడు. అక్కడ రోగిష్టి భర్తకు సపర్యలు చేస్తున్న ఆ గృహిణి సన్యాసికి కొంతసేపు ఆగమంటుంది. దాంతో కోపోద్రిక్తుడైన ఆ మహాముని ఎంత ధైర్యం నీకు, నన్నే ఆగమంటావా, నా శక్తి గురించి నీకు తెలీదు అంటాడు. వెంటనే ఆ గృహిణి నేను, కాకి, కొంగలా గ పక్షిని కాదు నన్ను భస్మం చేయడానికి అంటుంది. కంగుతిన్న ఆ సన్యాసి నీకు ఆ పక్షుల సంగతి ఎలా తెలిసింది అని అడుగుతాడు.

దానికి నాకు అతీతశక్తులు లేవు. నా ధర్మాన్ని నేను మనస్ఫూర్తిగా చిరునవ్వుతో నిర్వర్తిసున్నాను అంటుంది. సన్యాసితో నీ ధర్మ సందేహాలు తీరాలంటే మిథిలా నగరంలో ఉన్న ధర్మవ్యాధుడు వద్దకు వెళ్లమని చెబుతుంది. ధర్మవ్యాధుడిని చూడడానికి వెళ్లిన సన్యాసి మొదట్లో అతనితో మాట్లాడ్డానికి ఇష్టపడడు కానీ తరువాత అతన్ని కలిసి అడుగుతాడు ఇంతటి ఘోరమైన, అసహ్యమైన పనిని ఎలా చేస్తున్నావు అని. దానికి ధర్మవ్యాధుడు నేను కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నా మాంసం వృత్తిని నేను చేస్తున్నానంటాడు. అంతేకాదు తన జన్మను బట్టి తానీ పనిచేయాల్సి వస్తోందంటారు.

ఏ పనీ అసహ్యమైంది కాదు, అపవిత్రమైంది అంతకంటే కాదు. చేసే ఏ పనైనా తగిన పని అనుకుంటే బాగా చెయ్యగలం అంటాడు. ఏ పనిచేసినా దాన్నే భగవంతుడికి సమర్పణ చేసి చేయాలంటాడు. ఏ పనినైనా మనసుకు తీసుకోకుండా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి నిబద్ధతతో చేస్తున్నాను అనుకోవాలి అంటాడు. మంచిని సాధించడానికి ఎవరికైనా అహింస, సత్యం అన్న ఈ రెండు మూలస్తంభాలంటాడు. ఎంతటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా సత్యానికి కట్టుబడి ఉండగలిగేవాడే మంచిని సాధించగలడంటారు. పుట్టుక వల్ల కాకుండా చేసిన ధర్మం, సత్ప్రవర్తన వల్లే బ్రాహ్మణుడుగా పరిగణింపబడతాంటారు.

ఈ కథ ప్రకారం స్వధర్మాన్ని సక్రమంగా నెరవేర్చగలిగినప్పుడు ఇతరుల మంచి కోరుకునే వ్యక్తులు ఏ కులంలో పుట్టినా బ్రాహ్మణుడుగానే పరిగణించబడతాడు అంటాడు. ఉన్నతకులంలో జన్మించినా తన మంచికోసం తప్ప, ఇతరులకోసం ఆలోచించనివాడు, మంచిచేయని వాడు బాహ్మణుడే కాదంటాడు.