Home యాదాద్రి భువనగిరి గ్రామసభలో డబుల్‌కు దరఖాస్తుల వెల్లువ

గ్రామసభలో డబుల్‌కు దరఖాస్తుల వెల్లువ

Doublebedroom-House

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట గ్రా మపంచాయతీ గ్రామసభ నిర్వాహణలో డబుల్ బె డ్రూం, పింఛన్ కొరకు పట్టణ ప్రజల దరఖాస్తులు వె ల్లువెత్తాయి. ప్రభుత్వం ఆదేశాల వరకు గ్రామ సం క్షేమం, సమస్యల పరిష్కారం కొరకు శనివారం రో జున గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బూడిది స్వామి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు.

గ్రామసభ సమాచారం తెల్సుకున్న పట్టణ ప్రజలు సిఎం అమలుపరుస్తామని చెప్పిన డబుల్ బెడ్రూమ్, నూతన పింఛన్లు అమలుచేయాలని అర్హులైన పేద ప్రజలు వందలాదిగా తరలివచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు దరఖాస్తుదారులు మా ట్లాడుతూ సిఎం కెఆర్ డబుల్ బెడ్రూమ్‌లను నిరు పేదలందరికీ కట్టిస్తామని చెప్తున్న మాటను యాద గిరిగుట్ట పట్టణంలో నిరుపేదలైన మాకు వెంటనే డ బుల్ బెడ్రూమ్ ఇల్లును అమలుపర్చాలని కోరారు. ప ట్టణంలోని మంచినీటి సరఫర, పారిశుద్దత, పలు అ భివృద్ధి పనులు సరిగ్గా జరగడం లేదని గ్రామసభలో పలువురు మొర పెట్టుకున్నారు.

సర్పంచ్ స్వామి మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి ప నులు చేపట్టడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ గ్రా మసభలో గ్రామపంచాయతీ ఇఒ కె.నర్సింహ్మరెడ్డి, ఉపసర్పంచ్ భరత్‌గౌడ్, వార్డు సభ్యులు అండాలు, శ్రీధర్, శంకరమ్మ, ధనలక్ష్మీ, సుజాత, పద్మ, కావేరి, ఆంజనేయులు, సిపిఐ మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, బంగారి, రాజు, గ్రామప్రజలు తదితరులు పా ల్గొన్నారు.