Home భద్రాద్రి కొత్తగూడెం అప్పుల పెళ్లి

అప్పుల పెళ్లి

BHADRACHALAM

భద్రాచలం: పేరుకే దక్షిణ భారత అయోధ్య… మిగులు ఆదాయంలో మాత్రం నిరుపేద. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయం నిధుల లేమితో కొట్టు మిట్టాడుతోంది. వచ్చే ఆదాయానికి అయ్యే ఖర్చు సమానంగాఉండటంతో ఉత్సవాల నిర్వహణ భారంగా మారుతోంది. భక్తుల మనోభావాలకు ఎక్కడా నొచ్చుకోకుండా, భగవం తుని ప్రతిష్ట అప్రతిష్టపాలు కాకుండా ఉండేందుకు లోకకళ్యాణార్థం భద్రాద్రిలో ప్రతీ ఏటా జరిగే ఉత్సవాల ను భారమైనప్పటికీ కొనసాగిస్తూ నెట్టుకొస్తున్నారు. భద్రాద్రి రామయ్యపై ప్రభుత్వం దృష్టి సారి ఉత్సవాల సమయంలో ప్రభుత్వం తరుపున నిధులు కేటాయిస్తే మేలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఇందుకు దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళితే అంతా బాగుంటుందని పలువురు భావిస్తున్నారు.

ఆలయానికి భారంగా మారిన ఉత్సవాలు… భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దేవస్థాన ఎంతో ఘనచరిత్ర ఉంది. రామదాసు కాలం నుండి ఇక్కడ స్వామి కైంకర్యాలు అందుకుంటున్నారు. దూపదీపనైవేద్యాలతో పాటు ఆరాధనలు, సేవలు పొందుతున్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామయ్య భక్తులు ఎదో ఒక సందర్భంలో భద్రాద్రికి వచ్చి దర్శన భాగ్యాన్ని పొంది వెళుతుంటారు. లేదా వారివారి దేశాలకు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి కళ్యాణాలు జరిపిస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆ దేవాది దేవుని ఆలయాన్ని నిధుల లేమి వేదిస్తోంది. ప్రతీ ఏటా భద్రాద్రి దివ్య క్షేత్రంలో శ్రీ రామ నవమి, ముక్కోటి ఏకాదశి, శబరి స్మృతి యాత్ర, దమ్మక్క స్మృతియాత్ర, వాగ్గేయ
కారోత్సవాలు, హనమత్ జయంతి, గణేష్ నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు తదిత ఉత్సవాలను నిర్వస్తుంటారు. ప్రతి నెల ఆలయానికి సుమారు రూ.1.20 కోట్ల నుండి రూ.1.30 కోట్ల వరకు ఆదాయం భక్తులు రూపంలో సమకూరుతోంది. అందులో నుంచి సిబ్బంది జీతభత్సాలు, ప్రసాదాలు, ఇతరత్రా ఖర్చులకు వెచ్చిస్తుంటారు. ఆదాయానికి తగ్గట్లుగానే ఖర్చు కూడా ఉండటంతో వచ్చింది బొటాబోటిన సరోపోతోంది. దీంతో ప్రధాన ఉత్సవాల నిర్వహణ ఆలయానికి పెద్ద భారంగా మారింది. శ్రీరామ నవమి వసంతపక్ష తిరుకళ్యాణ మహోత్సవాల సమయంలో ప్రతీ ఏటా రూ.60 లక్షల నుండి రూ.70 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అదే విధంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సుమారు రూ.50 లక్షలు, ఇతరత్రా వేడుకలకు మరో రూ.10 లక్షలు కలిపి మొత్తం మీదు రూ.2 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు.వచ్చే ఆదాయం సరిపోక, ఉత్సవాలు నిర్వహణ ఆపలేక రామాలయం అప్పులు చేస్తూ వేడుకలను జరిపిస్తోంది. ఈ అప్పులను నెమ్మది నెమ్మదిగా తీరుస్తూ వస్తుందో. ఈ అప్పులు తీరేలోగా మరో ఉత్సవం వచ్చి
పడుతోంది.
ప్రభుత్వం నిధులు కేటాయిస్తే మేలు… ప్రతిఏటా జరిగే కార్యక్రమాలకు సమారు రూ.2 కోట్ల వరకు అదనపు ఖర్చు అవుతోంది. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేక సుమారు రూ.5 కోట్ల నిధులు కేటాయిస్తే మరింత వైభవోపేతంగా వేడుకలు నిర్వహించుకోవచ్చని భక్తులు ఆశిస్తున్నారు. నవమి, ముక్కోటి ఉత్సవాల్లో గీసి గిసీ ఖర్చు చేయకుండా సీతారాముల కళ్యాణం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు మరింత వెన్నె తెచ్చేందుకు వీలుటుందని, మరిన్ని సౌకర్యాలు భక్తులకు కల్పించే అవకాశం ఉంటుందని , దేవదాయశాఖామాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు, భవనాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళితే బాగుటుందని రామభక్తులు వేడుకొంటున్నారు.