Thursday, April 18, 2024

కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు

మన తెలంగాణ/కీసర : మహా శివరాత్రి పర్వదినాన సుప్రసిద్ధ ప్రాచీన శైవ క్షేత్రమైన కీసరగుట్టలో ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం ప్రతిధ్వనించింది. శ్రీరామలింగేశ్వరుడి దర్శనార్థం తరలివచ్చి న భక్తులతో కీసరగుట్ట జనసంద్రాన్ని తలపించిం ది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయ పరిసరాల్లో ఉన్న శివలింగాలకు అభిషేకాలు, పూజ లు నిర్వహించి తన్మయత్వం చెందారు. గురువా రం తెల్లవారు జామున మూడు గంటల నుంచి దర్శ నాలు ప్రారంభం కాగా ఉదయం మందకొడిగా ఉన్న భక్తుల రద్దీ మధ్యాహ్నం తర్వాత పెరిగింది. క్యూలైన్ల ప్రవేశ ద్వారం నుంచి భక్తులు భారీగా క్యూలైన్లలో వేచిఉన్నారు. కోవిడ్ నేపథ్యంలో మాస్కు లు ధరించి వచ్చిన వారిని మాత్రమే దర్శనాలకు అనుమతించారు. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్కానిం గ్ నిర్వహించి, శానిటైజర్ అందించారు.

శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ఆనవాయితీ ప్రకా రం మంత్రి మల్లారెడ్డి దంపతులు ప్రభుత్వ పరంగా పట్టు వస్త్రాలను అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తెల్లవారు జామున మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి స్వామి వారి మహన్యాస రుద్రాభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనాని కి విచ్చేసిన ప్రముఖులకు ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు దర్శనం అనంతరం ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్ నాగలింగం శర్మ స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు. జిల్లా కలెక్టర్ శ్వేతా మహం తి, అదనపు కలెక్టర్ విద్యాసాగర్ బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News