Home కుమ్రం భీం ఆసిఫాబాద్ గిరిజనుల సంక్షేమానికి పెద్దపేట

గిరిజనుల సంక్షేమానికి పెద్దపేట

Harish-Rao1

జైనూర్ /వాంకిడి : గిరిజనుల సంపూర్ణ అభివృద్దికై ప్రభుత్వం పెద్ద పీఠ వెస్తుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరిష్‌రావ్ అన్నారు. హైమన్ డార్ప్ బెట్‌ఎలిజా బెట్ దంపతుల 30వ వర్ధంతిని బుధవారం మార్లవాయి గ్రామంలో గిరిజన సాంప్రదాయ బద్దంగానిర్వహించారు. అధికారికంగానిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావ్ హజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి ఐకే రెడ్డి, ఎంపి నగేష్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీ జిల్లాల కలెక్టర్‌లు జ్యోతి బుద్ద ఎం ప్రకాష్, కర్ణన్, చంపాలాల్‌లతో పాటు చెల్లప్ప కమీషన్ సభ్యులు పాల్గొని డార్ఫ్ దంపతుల సమాదుల వద్ద శ్రద్దాంజలి ఘటించారు.డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాల నివాళ్లు అర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన వర్దంతిసభలు మంత్రి హరీష్ రావ్ మాట్లాడారు.

ఆదివాసీ గిరిజనుల అభివృద్దికై హైమన్ డార్ఫ్ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. డార్ఫ్ స్పూర్తితో గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో ఉందన్నారు. గతప్రభుత్వాలు చేయలేని విదంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ది చేస్తుందన్నారు. జనాభా ప్రతిపాదిక గిరిజనులకు 12 శాతం రిజర్వేష్ కల్పించేందుకు త్వరలో నిర్వహించనున్న శాసన సభలోనే బిల్లు పాస్‌చేస్తామన్నారు. జిల్లాల విభాజనతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది సులభమైందని ఇదే స్పూర్తితో త్వరలోనే పంచాయతీలను విభజిస్తామన్నారు. ఇప్పటికే క్యాబినెట్లో అమోదం పొందామని రానున్న పంచాయతీ ఎన్నికలను పంచాయతీలను విభాజించిన తరువాతే నిర్వహించి తీరుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు గిరిజనులపై చిన్న చూపు చూసిందని అభివృద్దిపై నిర్లక్షం వహించిందని అన్నారు. జోడే ఘాట్‌లో కుమ్రం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రూ.25 కోట్లతో జోడేఘాట్ అభివృద్దిచేస్తుందన్నారు.

కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఉత్సవాలకు ప్రతి ఏటా 40 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. గిరజనుల ఆరాధ్యా దైవులు జంగుబాయి దేవస్థానంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రతి ఏటా 10లక్షలు వెచ్చిస్తుందన్నారు. ఇదే క్రమంలో హైమన్ డార్ఫ్ వర్ధంతినికూడా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆదివాసీల అభ్యునతికై హైమన్ డార్ఫ్ చేసిన సేవలకు గుర్తింపుగా జైనూర్, సిర్పూర్(యు) సరిహద్దులో ఉన్న వాగపూర్ చెరువులో 2.5 కోట్లతో మీని ట్యాంక్‌బండ్ నిర్మించి హైమన్ డార్ఫ్ పేరు పెడాతమని అన్నారు. అంతకు ముందు గిరిజనులు తమ సాంప్రదాయ బద్దంగా డోలు, తుడం వాయిస్తు నృత్యాల మధ్య మంత్రులకు, అధికారులకు ఘన స్వాగతం పలికారు. ఇందులోనే భాగంగా మంత్రులు హరిష్, ఐకే రెడ్డిల చేతుల మీదుగా డార్ఫ్ రాసిన మానవడు కోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీం ఎస్పీ సన్‌ప్రిత్ సింగ్, స్థానిక సర్పంచ్ మడావిభీంరావ్, సర్పంచ్‌లు పెందూర్‌అర్జున్, మేస్రం గోవింద్, ఎంపిటిసి దేవ్‌రావ్, హైమన్‌డార్ఫ్ యువజన సంఘం సభ్యులు కనక వెంకటేష్, అంబజీ రావ్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్(యు)లో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు శంకుస్థాపన : అన్ని వనరులున్న కుమ్రం భీం జిల్లా అభివృద్దికి ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని పర్యాటక కేంద్రం కూడా గిరిజన ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు కేయిస్తుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరిష్‌రావ్ అన్నారు. బుధవారం మండలంలోని రాగపూర్ చెరువు వద్ద 2.34 కోట్లతో నిర్మించే మినిట్యాంక్‌బండ్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావ్‌తో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలు శంకుస్థాపనచేశారు.

ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రాగపూర్ చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.మిని ట్యాంక్ బండ్‌తో పాటు గిరిజన ప్రాంతంలోని వనరులు ఉన్నచోట ప్రత్యేక అభివృద్దికి నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఇందులోనే భాగంగానే అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన్యత క్రమంలో అందజేస్తుందన్నారు. త్వరలోనే వీటి పనులను ప్రారంభించి సత్వరమే పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చెరువు ఆయకట్లు నీటి నిల్వ తదితర అంశాలను మంత్రులు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపి నగేష్, ఎమ్మెల్సీ పురాణం సతీష్,ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, ఐటీడీఏ పీఓ ఆర్వీ కర్ణన్, మైనార్‌ఇరిగేషన్ అధికారులు, తహసీల్దార్ ఇమ్రాన్, ఎంపిడివో శశికళ, ఎంపిపి మేస్రం అంబుబాయి పొలాజి, జడ్పీటీసీతో పాటు స్థానిక సర్పంచ్ ఆత్రం ఓంప్రకాష్, యశ్వంత్ రావ్, గ్రామపటేల్ కోవ అమృత్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.

మామడలో : సదర్‌మాట్ బ్యారేజ్‌కు 516 కోట్లు మంజూరు
సదర్‌మాట్ మీని బ్యారేజ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి 516 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావ్ అన్నారు. మండలంలోని పొన్కాల్ గ్రామం వద్ద గోదావరినదిపై  సదర్‌మాట్ మీని ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి హరిష్ రావ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శిలాఫలం ఆవిష్కారించి అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఖానాపూర్ మండలంలో 120 సంవత్సరాల క్రితం నిర్మించిన సదర్‌మాట్ బ్యారేజీ శిథిలావస్థకు చేరుకుందని ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్ట్ నిర్మాణం తరువాత సదర్‌మాట్ బ్యారేజీలో నీటి నిల్వ తగ్గిపోయిందని, ఉమ్మడి రాష్ట్రం అప్పటి కాంగ్రెస్ తదితర పార్టీల పాలనలో అభివృద్ది కుంటు పడిపోందని అప్పుడు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం పునర్ నిర్మిస్తు రైతుల అభివృద్దికి కృషి చేస్తున్న తరుణం కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి అటంకం కలిగిస్తు రైతులను తప్పుదొవ పట్టిస్తుందని ఆరోపించారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, జగిత్యాల జిల్లాలోని మెట్‌పెల్లి తాలుకలో, మామడ మండలంలోని పొన్కల్, కమల్‌కోట్, కోత్తుర్ గ్రామాల 1200 ఎకరాల భూమి ముంపుగురవుతుందని తెలిపారు. భూములు కొల్పోతున్న రైతులకు వారి అభిష్టం మేరకు 5 లక్షల నుంచి 8.5 లక్షల వరకు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ ద్వారా చుట్టుపక్కాల 17 కిలోమిటర్ల వరకు నీటి నిల్వలు పెరుగుతాయని దీంతో రైతులు రెండు పంటలు భూములు సాగు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలురకాల అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.రైతుల అభివృద్ది కోసం మిషన్‌కాకతీయ పథకం ద్వారా పలు చెరువులకు జలకళ తీసుకువచ్చామని తెలిపారు.

వాంకిడిలో : గిరిజనుల సంక్షేమాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మార్కెటింగ్, భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మండలంలోని వాంకిడి మండల మహిళ సమాఖ్య ఇందిరా క్రాంతి కార్యాలయంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం పేరుతో ఐటిడిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిని రెడ్ గ్రామ్ దాల్ మిల్‌కేంద్రాన్ని రాష్ట్ర,న్యాయ, దేవాదాయ, గృహనిర్మాణ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపి గొడం నాగేష్,ఎంఎల్‌సి పురాణం సతీష్, ఎంఎల్‌ఏలు కోవలక్ష్మి, కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్ చంపాలాల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్, జెసి అశోక్ కుమార్లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి బుధవారం దాల్‌మిల్ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని వాంకిడి,కెరమెరి, తిర్యాణి, మండలాలోని 3 వేల మంది గిరిజన రైతులకు ఈ దాల్‌మిల్ ద్వారా ఆర్థిక చేయుత అందనుందన్నారు. రైతు ఉత్పత్తి దారుల సంఘం నుంచి పండించిన కంది పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి, మిల్లులోతయారి చేసిన దాల్‌ను ప్రభుత్వ ఆశ్రమ వసతి గృహాల్లో సరఫరా చేయడం జరుగుతుందన్నారు. దీని వలన రైతు ఉత్పత్తి సంఘాలతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మరో జొన్న సుద్ధికేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.

త్వరలోనే రాష్ట్రం మొత్తం దాల్‌మిల్‌లు ఏర్పాటు చేసిన రైతులకు చేయుతనందిస్తామన్నారు. ప్రస్తుతం కొమురంభీం కేంద్రంతో పాటు జైనూర్ కాగజ్‌నగర్‌లో 5500 రూపాయాల మద్దతు ధరతో కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంజరిగిందన్నారు. వనబందు కళ్యాన్ యువజన పథకం ద్వారా మంజూరైన 8.50 లక్షల నిధులతో దాల్‌మిల్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. దీని ద్వారా జిల్లాలోని గిరిజన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. దాల్‌మిల్‌ను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు.