Home తాజా వార్తలు గణితంపై ఆసక్తి పెంచుకోవాలి

గణితంపై ఆసక్తి పెంచుకోవాలి

మనతెలంగాణ /తెల్కపల్లి : విద్యార్థులు గణిత శాస్త్రం పట్ల ఆసక్తి పెంచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఎం. కుమార్ అన్నా రు. మంగళవారం మండల పరిధిలోని బొప్పాయిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా గణిత మేళాను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా గణిత మేళాలో పాల్గొని వివిధ రకాల గణిత నమూనాలను, గణిత ప్రాముఖ్యతను తెలిపే చార్జీలు ప్రదర్శించారు. అదే విధంగా గణిత నమూనాలను, గణిత ప్రాముఖ్‌యతను తెలిపే చార్జీలు ప్రదర్శించారు. అదే విధంగా గణిత ప్రాముఖ్య సంఖ్య 1729 ఆకృతిలో విద్యార్థినిలు నిల్చుని ఆ సంఖ్య ప్రాముఖ్యతను చాటారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి. శ్రీనివాసులు, కె. సునిల్ కుమార్, శ్రీనివాసులు, బాలరాజ్‌గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు.