Friday, April 26, 2024

బయోఆసియాతో మరిన్ని పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

KTR

 

హైదరాబాద్ నగరానికి ప్రపంచస్థాయి లైఫ్‌సైన్సెస్ కంపెనీలు

నేటి నుంచి మూడు రోజుల పాటు హెచ్‌ఐసిసిలో జరగనున్న బయోఆసియా సదస్సు ఇందుకు తోడ్పడుతుంది : మంత్రి కెటిఆర్
పాల్గొననున్న 37 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు, 800 కంపెనీలు, 75 స్టార్టప్‌లు

మన తెలంగాణ/హైదరాబాద్ : సోమవారం నుంచి మూడు రోజుల పాటు 17 వ బయో ఆసియా సదస్సు నగరంలోని హెచ్‌ఐసిసిలో జరగనుంది. టుడే ఫర్ టుమారో అ నే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. రేపటి తరాల కోసం ప్రపంచంలోని లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుకొ ని, పెట్టుబడులు పెట్టడంతో పాటు అవసరమైన చర్యలను విధానాలను రూపకల్పన చేసేందుకు మూడు రోజులపాటు జరిగే బయో ఆషియా సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రప ంచ వ్యాప్తంగా 37 దేశాల నుంచి సుమారు 20 00 మంది ప్రతినిధులు, 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్ కంపెనీలు ఈ సదస్సులో భాగస్వాములు అవుతున్నాయి. దీనికి ఈ సం వత్సరం స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా ఉన్న ది. అలాగే అస్సాం, కేరళ, ఒరిస్సా, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామి రాష్ట్రాలుగా ఉన్నా యి.

గత దశాబ్ద కాలంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఉన్న అవకాశాల పరిశీలన, ఇక్కడ పెట్టుబడుల కోసం ప్రప ంచ స్థాయి లైఫ్ సైన్సెస్, ఫార్మా పారిశ్రామిక వ ర్గాలతోపాటు పరిశోధకులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో బయో ఆషియా కీలకపాత్ర వహిస్తోంది. హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కంపెలను రప్పించడంలో బయో ఆసియా కీలకపాత్ర వహిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బయో ఆసియా సదస్సు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి పరిశ్రమల మౌలిక వసతుల ప్రమాణాలను, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించేందుకు ఈ సదస్సు చక్కటి అవకాశంగా ఆయన అభివర్ణించారు. ఇక్కడి బయో,లైఫ్ సైన్సెస్ ఇకో సిస్టమ్ గురించి నేరుగా తెలుసుకోవడానికి ఈ సదస్సు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు.

ఈ సదస్సును విజయవంతం చేసి హైదరాబాద్‌లో మరిన్ని లైఫ్ సైన్సెస్, ఫార్మా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత 17 సంవత్సరాలుగా నిర్వహించిన సదస్సుల్లో భాగంగా వందలకొద్ది ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక కంపెనీలకు గ్లోబల్ ఇన్వెస్టర్లను పరిచయం చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా అనేక మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ప్రపంచ స్థాయి కంపెనీల సీనియర్ ప్రతినిధులు, పరిశోధకులు మూడు రోజులపాటు జరిగే వివిధ సమావేశాల్లో ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు.

ఈ సదస్సులో ప్రధానంగా భారతదేశం లైఫ్ సైన్సెస్, ఫార్మా పరిశ్రమ, మెడికల్ డివైసెస్ అండ్ డిజిటల్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య రంగంలో వస్తున్న అంటువ్యాధులను (ఎపిడమిక్స్) మరింత సమర్ధంగా ఎదుర్కోవడమేలా అనే అంశం, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్య రంగంలోని సవాళ్లుకు చవకైన పరిష్కారాలను కనుగొనడం వంటి పలు కీలకమైన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగంలో మహిళలు సాధించిన ప్రగతిపైన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారి సేవలు గుర్తించనున్నారు. ఇండియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి అనేక దేశాల నుంచి ఎంపిక చేసిన 75 స్టార్ట్‌అప్ కంపెనీలు సుమారు 175 ప్రదర్శనలను ఇవ్వనున్నాయి.

More investments with BioAsia
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News