Home జాతీయ వార్తలు విషమించిన జైట్లీ ఆరోగ్యం

విషమించిన జైట్లీ ఆరోగ్యం

Arun Jaitley
ఎయిమ్స్‌లో ఇసిఎంఓపై చికిత్స, పరామర్శించిన పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఎయిమ్స్‌లో ఆయనకు లైఫ్ సపోర్ట్ సిస్టం ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రాత్రి 10.08 గంటలకు జైట్లీని డయాలిసిస్‌పై ఉంచారు.10.17 గంటలకు ఎక్స్‌ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఇసిఎంఓ)ను అమర్చారు. శ్వాస ఆడకపోయినా, లేదా గుండెకు సంబంధించిన తీవ్ర సమస్య ఏర్పడినా ఈ చికిత్స అందిస్తారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల వైద్య నిపుణులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు అనేక మంది ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. ఆదివారంనాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మనిష్ సిసోడియా ఎయిమ్స్‌కు వచ్చి జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, బిజెపి నాయకుడు సతీష్ ఉపాధ్యాయ, రాజ్యవర్దన్ రాథోడ్, జితేంద్రసింగ్, బిజెపి ఎంపి స్వపన్‌దాస్ గుప్తా, కాంగ్రెస్ నాయకులు అభిషేక్ సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం మాయావతి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ బిరేంద్రసింగ్ ధనోయా మొదలైనవారు జైట్లీ ఆరోగ్యం గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.

More leaders visit AIIMS as Arun Jaitley remains critical