Sunday, December 3, 2023

రష్మికకు అక్కడ మరో ఆఫర్?

- Advertisement -
- Advertisement -

More offers for Rashmika in Kollywood

ఇటీవలే ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తమిళ స్టార్ హీరో విజయ్ తన తర్వాతి చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా పూజా హెగ్డేను ఫైనల్ చేశారు మేకర్స్. అయితే ఇందులో పూజాతో పాటు మరొక హీరోయిన్ కూడ ఉంటుందట. ప్రస్తుతం ఆమె కోసమే వెతుకుతున్నారట మేకర్స్. రెండవ కథానాయకిగా స్టార్ నటినే తీసుకోనున్నారు. అయితే ఆ అవకాశం రష్మిక మందన్నకు వచ్చేలా ఉందని తెలిసింది. రష్మిక అయితే విజయ్ సరసన కొత్తగా కనిపిస్తుందని, ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్ ఇస్తుందని భావిస్తున్నారట. ఇది నిజమైతే రష్మికకు విజయ్ సినిమా ఆఫర్ దక్కితే మాత్రం ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంటుంది. తమిళంలో రష్మిక చేసిన మొదటి సినిమా కార్తీ ‘సుల్తాన్’. త్వరలోనే ఆ చిత్రం విడుదలకానుంది. ఆ సినిమా మీదే రష్మిక ఆశలన్నీ ఉన్నాయి. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటే కోలీవుడ్‌లో ఆమెను ఇంకొన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఆ చిత్రం విడుదలవక ముందే ఆమెకు విజయ్ సినిమా రూపంలో గోల్డెన్ ఛాన్స్ దక్కేలా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News