Home కరీంనగర్ కాలుష్యం కక్కుతున్న తారు మిక్సింగ్ ప్లాంట్

కాలుష్యం కక్కుతున్న తారు మిక్సింగ్ ప్లాంట్

పొగ,దుమ్ము, దుర్వాసనతో ఇబ్బందులు
వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు

Pollution

మానకొండూర్: కాస్త ఆలోచించాల్సిందే కదా..! ఇవాల్టికి సరిగ్గా ఇరవై యేళ్ల క్రితం అనగా 20 జనవరి1995 నాడు తాజ్‌మహల్ చు ట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను మూసివేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రాణమేలేని అలాంటి కట్టడాలను కాపాడటానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అంతటి ప్రయత్నాలు చేస్తున్నా.., మనం ఎన్నుకు న్న ఈ ప్రభుత్వాలు మన ప్రాణాలకు ముప్పు తెస్తున్న కాలుష్య కారక పరిశ్రమ లపై ఎందుకు ఇంత ఉదాశీనంగా వ్యవహరిస్తున్నట్లు, నిత్యం జనాల రాకపోక లతో ఉండే రోడ్ల పక్కనే కాలుష్యం కక్కే పరిశ్రమలకు ఎందుకు అనుమతులు ఇ స్తున్నట్లు, అనారోగ్యాలను కొనితెస్తున్న పరిశ్రమలపై ఎందుకు ఇంత ఉదాశీన ంగా వ్యవహరిస్తున్నట్లో కాస్త ఆలోచించాల్సిందే కదా…!!మండలంలోని చెంజర్ల గ్రామ పంచాయితీ పరిధిలోని కరీంనగర్-వరంగల్ ప్రధాన పక్కనే ఉన్న తారు మిక్సింగ్ ప్లాంట్ కాలుష్యానికి నిలయంగా మారింది.

తారు మిక్సింగ్ ప్లాంట్‌లో నుంచి వెలువడే దుర్వాసన కలిగిన పొగను పీల్చుతూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్లాంట్ పరిసర ప్రాంతంలోని రైతులు, గీతకార్మికులు, రహదారిపై వివిధ వాహనాలలో వెళ్లే ప్రయాణీకులు కాలుష్యం గాలిని పీల్చతూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి పక్కనే నెలకొల్పిన హాట్ మిక్సింగ్(తారు)ప్లాంట్ యజమాన్యం తారు(డాంబర్)ను తయారు చేసే సమయంలో ప్లాంట్‌గొట్టంలో నుంచి దట్టమైన పొగ దుర్వాసనతో బయటికి వచ్చి గాలిలో కలుస్తుండటంతో రోడ్డుపై వెళ్లే ప్రయా ణికులు, ప్లాంట్ సమీపంలోని రైతులు, గీత కార్మికులు కాలుష్యంగా మారుతున్న గాలిని పీల్చుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. ప్లాంట్ యజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ మిక్సింగ్ ప్లాంట్‌ను నడుపుతున్నదని ప్రజలు ఆరో పిస్తున్నారు.

ప్లాంట్‌లో టిప్పర్‌లతో చిప్స్(కంకర) పోసే సమయంలోనూ రో డ్డంతా దుమ్ము కమ్ముకుంటుందని, దుమ్ము కారణంగా ప్రమాదాలు జరిగే ప్ర మాదం ఉందని, ప్రయాణికులు దుమ్ము, పొగతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్లాంట్‌లో ఆయిల్‌తో మంట పెట్టడంతో దట్టమైన పొగలు వెలువడుతున్నాయని, ప్లాంట్‌లో నుంచి వెలువడే కాలుష్యం గాలి కారణంగా అనారోగ్యం పాలు అవు తున్నామని ప్రయాణికులు వేదన వ్యక్తం చేస్తున్నారు. మిక్సింగ్ ప్లాంట్ చుట్టు పక్కల తాటి చెట్లు అధికంగా ఉండటంతో కల్లుగీసే గీతకార్మికులు ప్లాంట్ నుంచి వెలువడే కాలుష్యంతో అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన రహదారిని ఆనుకునే ప్లాంట్ ఉండటంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణీకులు కాలుష్యంతో కూడిన గాలిని పీల్చి శ్వాస సంబంధిత వ్యాధులకు గురికావాల్సి వస్తోందని అంటున్నారు. ఈదులగట్టెపల్లి గ్రామ శివారులో ప్రధాన రహదారి పక్కనే ఏర్పాటు చేసిన తారు మిక్సింగ్ ప్లాంట్‌తోనూ ప్రయాణికులకు ఇబ్బం దులు తప్పడం లేదని వాపోతున్నారు. ప్రధాన రహదారిని ఆనుకుని ప్లాంట్‌లు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బందిగా మారాయి. కా లుష్యం కక్కుతున్న ఇలాంటి ప్లాంట్‌లను జనసంచారానికి దూరంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి. ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పిసిబి) అధికారులు స్పందించి తారు మిక్సింగ్ ప్లాంట్‌ను మూసివేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

తారు మిక్సింగ్ ప్లాంట్‌ను మూసివేయాలి

రోడ్డు పక్కనే ఉన్న తారు మిక్సింగ్ ప్లాంట్ నుంచి వెలువడే పొగను పీల్చి అనారో గ్యానికి గురవుతున్నామని, గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తమకు తారు మి క్సింగ్ ప్లాంట్ కారణంగా ఉపాధి దూరమవుతున్నామని గీత కార్మికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారును మిక్స్ చేసే సమయంలో దుర్వాసనతో కూడిన పొగ బయటికి వస్తుందని, ఆ పొగ కలిగిన గాలిని పీల్చడంతో సరిగ్గా ఊపిరి ఆడటం లేదని తెలిపారు. వెంటనే చెంజర్లలో ఉన్న తారు మిక్సింగ్ ప్లాంట్‌ను మూసి వేయాలని రవిందర్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాడు.
– సుదగోని రవీందర్, గీతకార్మికుడు