Home తాజా వార్తలు వసతులు పెంచుతాం: కెసిఆర్

వసతులు పెంచుతాం: కెసిఆర్

KCR-Press-Meet

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులకు బెడ్ల సంఖ్యను మించి పేషంట్లు వస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శనివారం కెసిఆర్ కిట్ ప్రారంభించిన అనంతరం సిఎం మాట్లాడుతూ..  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు, మెరుగైన సేవలు అందించడానికి సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అత్యంత మానవత్వంతో వైద్య సేవలు అందిస్తున్నామని, వసతులు కూడా పెంచామని వివరించారు.

ఆస్పత్రులకు వచ్చే పేషంట్ల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. పేట్ల బురుజు ఆస్పత్రుల్లో 462 బెడ్లు ఉంటే, 700 మంది పేషంట్లు వచ్చారని, అయినా సరే బెడ్లు లేవని పేషంట్లను పంపించడం లేదని చెప్పారు. ఎక్కువ మందికి సేవలందిస్తున్న ప్రభుత్వ వైద్యులను అభినందించాలన్నారు. పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నందున పేట్ల బురుజు ఆస్పత్రిలో మరో బ్లాక్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పేట్లబురుజు ఆస్పత్రిలో గతంలో మహాలక్ష్మి అనే డాక్టర్ గొప్పగా పని చేశారని కితాబు ఇచ్చారు. ధనవంతులు కూడా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకునే వారని తెలిపారు. ఈ ఆస్పుత్రిలో మళ్లీ ఆస్థాయిలో సేవలందించాలని కెసిఆర్ కోరారు.