Home జిల్లాలు ఇకపై మార్చురీ అంబులెన్స్‌లు

ఇకపై మార్చురీ అంబులెన్స్‌లు

mbnrకొడంగల్: ప్రమాదా ల్లో అస్వస్థతతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మృతి చెందిన వారి శవాలను వారి ఇళ్ల కు తరలించేందుకు మార్చురీ అంబులె న్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరో గ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లకా్ష్మరెడ్డి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమా ల్లో పాల్గొన్న మంత్రి ఇక్కడ జరిగిన స భల్లో ప్రసంగించారు. ఉదయం 9 గం టల ప్రాంతంలో కొడంగల్ చేరుకున్న మంత్రి స్థానికంగా నూతనంగా నిర్మిం చనున్న మండల పరిషత్ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థాని క ఇందిరానగర్ కాలనీలో ఇంకుడు గుంతల కార్యక్రమంలో పాల్గొని తవ్వ కాలు ప్రారంభించారు. తర్వాత మండ లంలోని అంగడిరాయిచూర్‌లో నిర్మిం చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనా న్ని మంత్రి ప్రారంభించారు. ఈ సం దర్భంగా జరిగినసభలో మంత్రి ప్రసం గిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. చాలా సందర్భాల్లో బీద ప్రజానీకం, తమ బం ధువులు ఆసుపత్రుల్లో చనిపోతే వారిని తీసుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారని అలాంటి పరిస్థితి నుంచి అదిగమించ డానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింద న్నారు. దీనిపై ఇటీవలే ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి అధికారులతో చర్చించా రని త్వరలో ఇవి అందుబాటులోకి వ స్తాయన్నారు. గత కొంతకాలంగా వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ జరగలేద ని, సిబ్బంది కొరత ఏర్పడి దృష్టా త్వ రలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు. కేజీ టు పీజీ వి ద్య వచ్చే విద్యా సంవత్సరం నుంచే అ మలు చేస్తారని చెప్పారు. ఈ మేరకు ఎ స్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్నా రు. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో వీ టిని కొనసాగిస్తారని త్వరలో భవన ని ర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్రతి ఎకరాకు నీరు, ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఊరికి సీసీరోడ్డు ఇ వ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే నెలాంతం నాటికి కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు. ప్రతి ఊ రికి రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు వివరించారు. సాగునీరు అందించడాని కి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే పాలమూరు-రంగారెడ్డి పథకమన్నారు. ఈ పథకం తో జిల్లా సస్యశ్యామలం చేస్తామన్నా రు. ఇక విద్యుత్ విషయానికి వస్తే ఈ సారి కోత లేని ఎండాకాలం కొనసాగిం దన్నారు. ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవా లని సూచించారు. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే కార్యక్ర మం చేస్తామన్నారు. మున్సిపాలిటీ నగ ర పంచాయతీల్లాగే అభివృద్ధికి నోచుకొ ని నియోజకవర్గ కేంద్రాల అభివృద్ధి ప్ర భుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేస్తున్న ట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమం లో నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాసు లు, స్థానిక ఎంపీపీ దయాకర్‌రెడ్డి, ఎం పీటీసీ సభ్యులు ముద్దప్ప, రాజేందర్, స్థానిక సర్పంచ్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్‌కు వరాలు..
అత్యంత వెనుకబడిన పాన్‌గల్ నియో జకవర్గాన్ని అభివృద్ధి పథకంలోకి తీ సుకురావడానికి చర్యలు చేపడతామని మంత్రి లకా్ష్మరెడ్డి చెప్పారు. ముఖ్యం గా కొడంగల్ నియోజకవర్గ కేంద్రం అభివృద్ధికి నోచుకోలేదని సర్పంచ్, ఎ మ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువచ్చా రు. దీనిపై స్పంచిన మంత్రి కొడంగల్ అభివృద్ధి తనవంతు కృషి చేస్తామన్నా రు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి భవ న నిర్మాణంతో పాటు మదర్ చైల్డ్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో గర్భిణీ స్త్రీలు తమ కా న్పులకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సౌకర్యంగా ఉంటుందన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ భవనానికి కూడా అదనపు నిధులు సమకూరుస్తామన్నా రు. మండలంలోని రోడ్లు లేని పది గ్రా మాలకు బీటీ రోడ్లు వేయిస్తామన్నారు. అలాగే ఐటీఐ కళాశాల ఏర్పాటు తన వంతు కృషి చేస్తామన్నారు.
కొడంగల్ పట్టణలోని ఇందిరానగర్ కాలనీలో మంత్రి ఇంకు డు గుంతల కార్యక్రమా న్నిమంత్రి ప్రారంభించారు. అందరూ విధి గా ఇం కుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల ని, ఇందుకోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు.