Friday, April 26, 2024

ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం ఉన్న సినిమా

- Advertisement -
- Advertisement -

Mosagallu pre release event

 

విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీచిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, విష్ణు మంచు అక్కా తమ్ముళ్లుగా నటించడం విశేషం. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈనెల 19న మోహన్‌బాబు పుట్టిన రోజు కానుకగా విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు మాట్లాడుతూ “ కాజల్ ఎంత మంచి నటి అన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు పక్కన అక్కగా నటించేందుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ పాత్రను ఒప్పుకున్నందుకు ప్రశంసిస్తున్నాను. ఇక భారతదేశంలో ఇటువంటి స్కాం ఇప్పటి వరకు జరగలేదు. అలాంటి కథను ధైర్యం చేసి విష్ణు తీశాడు. తల్లిదండ్రులు పడిన అవమానం భరించ లేక.. ఆ అక్కాతమ్ముడు ఇలా మోసం చేస్తుంటారు.

అక్కాతమ్ముడి సీన్స్ చూసి కంటతడి పెట్టేశాను. ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం ఉన్న సినిమా ఇది. సునీల్ శెట్టి పాత్ర అద్భుతంగా ఉంటుంది. మార్చి 19న నా పుట్టిన రోజు. అందుకే ఈ మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు విష్ణు. ఈ మూవీ హిట్ కావాలని ఆ దేవుళ్లను కోరుకుంటున్నాను”అని తెలిపారు. మంచు విష్ణు మాట్లాడుతూ “మా అక్క కాజల్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్. టాప్ పొజిషన్‌లో ఉన్న ఓ నటి ఇలా అక్క పాత్రను చేయడం మామూలు విషయం కాదు. నవదీప్ అద్భుతమైన నటుడు. నవీన్‌చంద్ర బాగా నటించాడు”అని అన్నారు. సునీల్ శెట్టి మాట్లాడుతూ “ఈ మూవీని తెలుగు, ఇంగ్లీష్‌లో ఒకే సారి షూట్ చేశాం. మార్చి 19 మాకు ఎంతో ప్రత్యేకం. ఈ మూవీ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం”అని చెప్పారు. ఈ వేడుకలో కాజల్ అగర్వాల్, రానా, శ్రీను వైట్ల, రాజా రవీంద్ర, డైమండ్ రత్నబాబు, స్టంట్ శివ, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News