Home తాజా వార్తలు 17 ప్రశ్నలకు జవాబులిస్తే… రూ. 10 వేలు బహుమతి

17 ప్రశ్నలకు జవాబులిస్తే… రూ. 10 వేలు బహుమతి

Mosquito App

 

హైదరాబాద్ : ప్రతి ఏడాది లక్షలాది మంది మంది అనారోగ్యానికి కారణమవుతోన్న దోమల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిహెచ్‌ఎంసి నూతన పద్దతిని ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నది. అందులో భాగంగానే మై జిహెచ్‌ఎంసి యాప్‌లో పొందుపరిచిన మస్కిటో యాప్ ద్వారా దోమల వ్యాప్తి, నిరోధం, ముందస్తు చర్యలు, ప్రజాచైతన్యంపై ప్రజల్లో కొత్త చైతన్యాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. 17 ప్రశ్నలతో కూడిన మస్కిటో యాప్‌ను గత సంవత్సరం ఆగష్టు 17న జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. మైజిహెచ్‌ఎంసి యాప్ లో పొందుపర్చిన ఈ మస్కిటో యాప్ ద్వారా అందులోని 17 ప్రశ్నల అన్నింటికి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి లాటరీ ద్వారా ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున పది మందికి లక్ష రూపాయల ఉచిత బహుమతిని అందించే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రకటించారు.

మరే దేశంలోనూ, నగరంలోనూ లేనటువంటి ఈ వినూత్న మొబైల్ యాప్ ద్వారా హైదరాబాద్ నగర ప్రజలను దోమల నివారణ పట్ల్ల చైతన్య కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ చేపట్ట్టింది. మై జీహెచ్‌ఎంసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ఇందులోని మస్కిటో యాప్‌లోని 17 ప్రశ్నలకు నగరవాసులు సమాధానాలు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దోమల వల్ల కలిగే మలేరియా వ్యాధి నివారణకు సికింద్రాబాద్‌లోనే మందును రాస్ రోనాల్డ్ రాస్ కనుగొని ప్రపంచానికి అందించారు. ఇట్టి హైదరాబా నగరంలో దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలోభాగంగా పాఠశాలలు, కళాశాలలు, కాలనీలు, కాలనీ సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి దోమల నివారణ, దోమల వల్ల సంభవించే వ్యాదులపై అవగాహన కలిపిస్తున్నారు.

మస్కిటో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేదిలా…
గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి మైజిహెచ్‌ఎంసి యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మై జిహెచ్‌ఎంసి యాప్ స్క్రిన్‌పై మస్కిటో యాప్ లో రిజిస్ట్రేషన్ ఫాం కనిపిస్తుంది. మీ పేరు, మొబైల్ నెంబర్, చిరునామాతో పాటు ఇతర వివరాలను నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపి సబ్‌మిట్ చేసిన అనంతరం స్క్రీన్‌పై 17 ప్రశ్నల ఫార్మాట్ వస్తుంది. ఈ 17 ప్రశ్నలకు అవును/కాదు అనే సమాధానాలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 17 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి లాటరీ ద్వారా పది మందికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల చొప్పున నగదు బహుమతులను అందించనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ ప్రకటించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ పథకంలో భాగంగా ఈ నగదు బహుమతులను అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆగష్టు 31వ తేదీలోపు మస్కిటో యాప్ లోని 17 ప్రశ్నలకు సరైన సమాధానాలు అందించినవారికి లాటరీ ద్వారా పది మందిని ఎంపిక చేసి ఒకొక్కరికి రూ. 10వేల నగదు బహుమతి అందించనున్నట్టు ఆయన ప్రకటించారు.

మస్కిటో యాప్ ద్వారా అడిగే ప్రశ్నలు ఇవే…
1. దోమ జీవిత కాలం సుమారు నెల రోజులు మాత్రమే అవును/ కాదు 2. ఆడ్దోమ త్న నెల రోజుల జీవిత కాలంలో వెయ్యి గుడ్ల్ను పెడుతుంది – అవును/ కాదు 3. కేవలం ఒక దోమ సంవత్సర కాలంలో కోట్లాది దోమల ఉత్పత్త్త్తికి అనగా మానవ జనాభా కంటే అధికంగా దోమల ఉత్పత్త్తికి కారణమవుతుంది – అవును/ కాదు 4. గుడ్డు స్థాయి నుండి దోమ స్థాయికి రావడానికి దోమల జీవన చక్రం 8 నుండి 10 రోజులు పడుతుంది – అవును/ కాదు 5. నీరు నిలువ ఉన్న ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టవు- అవును/ కాదు 6. పారుతున్న నీటిలో దోమలు గుడ్లు పెట్ట్డం ద్వారా డెంగ్యు, మ్లేరియా వ్యాధులకు కారణమవుతాయి – అవును/ కాదు 7. కుండలు, కూలర్లు, డ్రమ్ములు, సిమెంట్ ట్యాంక్‌లు, నాలా గుంతలు, మూసి ఉండని సంపులు, ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల్లో దోమలు ఉత్పత్త్తి కారణంగా డెంగ్యూ వ్యాధి సోకుతుంది. -అవును/ కాదు 8. ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించడం, నీటి నిల్వలను తొలగించడం ద్వారా డెంగ్యూ, మలేరియా కారక దోమలను నియంత్రించవచ్చను- అవును/ కాదు 9. ఇళ్ల పరిసర ప్రాంతాలు, పైకప్పులో వృథాగా ఉండి ఉపయోగించని వస్తువుల తొలగింపు ద్వారా డెంగ్యు కారక దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చును – అవును/ కాదు 10. లార్వా దశలో నిర్మూలించడం ద్వారా దోమల వ్యాప్తిని నియంత్రించవచ్చును – అవును/ కాదు 11. గంబూసియా చేపల ద్వారా దోమల గుడ్లు, లార్వాల అభివృద్దితో పాటు దోమల వ్యాప్తి పెరుగుతోంది. – అవును/ కాదు 12. సెప్టిక్ ట్యాంక్‌పై ఉన్న చిమ్నీ పైప్‌లను మేష్ ద్వారా కప్పుకోవడం దోమల వ్యాప్తికి కారణమవుతాయి అవును/ కాదు 13. మలేరియా ప్యారాసైట్‌ను కనుగొన్న నోబెల్ అవార్డు గ్రహీత రాస్ రోనాల్డ్ రాస్ సికింద్రాబాద్‌లో పనిచేశారు. – అవును/ కాదు 14. డ్రెయిన్‌లు, చెరువులలో ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలు వేయడం ద్వారా మురుగునీరు నిలిచి దోమల వ్యాప్తికి కారణమవుతాయి. – అవును/ కాదు 15. ఆడ, మగ దోమలు రెండు కూడా అంటువ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. – అవును/ కాదు 16. దోమల తెరలు వాడటం ద్వారా దోమకాటు నుండి, దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. – అవును/ కాదు 17. ప్రపంచంలో అత్యధికంగా మానవుల మరణాలకు కారణమయ్యే ప్రమాదమైన జంతువు దోమ. సంవత్సరానికి 7,25,000 మంది దోమ కాటు వల్ల మృతిచెందుతున్నారు. – అవును/ కాదు.

Mosquito App to Awareness on Mosquito Prevention