Home తాజా వార్తలు వరిలో సుడిదోమ యాజమాన్య పద్దతులు

వరిలో సుడిదోమ యాజమాన్య పద్దతులు

Paddy

 

నాగర్‌కర్నూల్ : మన రాష్ట్రంలో సుమారు 40 లక్షల ఎకరాలలో వరి పంటను ముఖ్యమైన ఆహారాపు పంటగా అన్ని జిల్లాలో సాగు చేస్తున్నారు. రైతులందరికి నాణ్యమైన విత్తనం ఎరువులు పురుగు మందులు సరైన సమయంలో విత్తుకోవడం పంట సమాచారం అంతా అందుతున్నప్పటికి రైతులకు ఆశించినంత దిగుబడులు రావడం లేదు దీనికి తోడు నీటికొరత కార్మికుల సమస్య తో రైతులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.

కృష్ణ విజ్ఞాన కేంద్రం పాలెం శ్రాస్తవేత్తలు కోఆర్డినేటర్ ఎం,జగన్‌మోహన్‌రెడ్డి, శ్రాస్తవేత్త యం.రాజశేఖర్ ఈ మధ్యకాలంలో వరి పంటలకు అనేక రకాలయిన చీడ పీడలు ఆశించిన్నప్పటికి వీటన్నింటినిలో అతి ముఖ్యమైనది సుడిదోమ గత 2 నుంచి 3 సంవత్సరాలతో సుడిదోమ ఉదృతి ఖరీఫ్ మరియు రబీ పంటలను అధికంగా ఆశించి పంట యొక్క ఉత్పత్తిని దెబ్బ ఆయడమే కాక పంట సాగు ఖర్చును కూడా ఎక్కువగా ఆయ్యేటట్లు చేస్తుంది. రైతులందరూ పంట నారు పోసినటప్పుటి నుండి పంట నాటుకునే వరకు సరైన యాజమాన్య పద్దతులు పాటించినట్లయితే సుడిదోమ ఉదృతిని దోమ అదుపులో ఉంచడమే కాకుండా అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా రైతులందరూ తమ ప్రాంతాలకు అనువైన మధ్య స్వల్ఫకాలిక రకాలను ఎంపిక చేసుకొని విత్తన శుద్ధి చేసుకొని నారుమడులను తయారుచేసుకోవాలి. దక్షిణ తెలంగానమండలానికి మధ్యకాలిక రకాలయిన కృష్ణ జగిత్యాల మసూరి విజేత మరియు స్వల్ఫ కాలిక రకాలయిన బతుకమ్మ తెలంగాణ కునారం సన్నాలు, కాటన్ దొర సన్నాలు, అనుకూలమయినవి.

వరిలో సుదిదోమ ఉదృతికి కారకాలుః
పొలంలో ప్రతి 2 మీటర్లకి 20 సె.మీటర్ల కాలి బాటలు తీయకపోవడం, దోమను తట్టుకోని రకాలను సాగు చేయడం, పొలంలో నీరును ఎక్కువగా నిల్వుఉంచడం, నాట్లను దగ్గదగ్గరగా వేసుకోవడం. పగటి ఉష్ణాగ్రతలు 26.30 మరియు రాత్రి ఉష్ణాగ్రతలు 21.22 ఉన్నప్పుడు , ఆగస్టు మాసంలో 300.400 మిమి మధ్య వర్షాపాతం పడడం ,తొలి దశలతో ఆశించే ఆకుముడుత పురుగు నివారణకు విపరీతంగా క్లోరోఫైరిఫాస్ ప్రాఫెనోపాస్ , ఎపిపేట్‌ను వాడిడం సింధటిక్ ఫైరధ్రాయిడ్స్‌కి చెందిన డెల్టామైధ్రిన్‌ను వాడడం వలన సుడిదోమ ఉదృతి పెరుగుతుంది.

సుడిదోమః వరి పంట పండించే అన్ని ప్రాంతాలల్లో రెండు రకాల దోమలు గోధుమ రంగు పురుగు తెల్లవీపుదోమ ఆశిస్తాయి.

ఆశించే కాలంః ఖరీప్‌లో సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు రబీలో మార్చి 2వ వారం నుండి ఏప్రిల్ వరకు

ఆశించేదశః నారుయడి దశలో మరియు పిలక దశలో అరుదుగా కనిపిస్తుంది. పొట్ట మరియు ఈనిక దశలో అత్యధికంగా వస్తుంది.

సుడిదోమ ఆశించిన పంట లక్షణాలుః సుడిదోమ ఎక్కువగా నీటి పైభాగంలో పాదులదగ్గర కనుబడడం పిల్ల, మరియు తల్లి పురుగులు మొక్కల నుండి రసాన్ని పీల్చడం వలన పైరు సుడులు సుడులుగా ఎండిపోవటం, ఉదృతి ఎక్కువగా ఉంటే పొలం ఎండిపోయి పడి పోవడం తాలుగింజలుగా మారడం జరుగుతుంది.

సుడి దోమను గుర్తించడం ఎలాః
ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో నీటిని గమనించినప్పుడు తెట్టులాగా తేలియాడి కనబడడం పొలంలో అడ్డంగా నడుసూ మొక్కల మొదళ్ళ దగ్గర గమనించినప్పుడు దోమలు ఉండటం తొలి దశలో దోమలు రసాన్ని పీల్చడం వలన పైర్లు లేత పసుపు వర్ణానికి మారుతాయి.

చేపట్టవలసిన సమగ్ర సస్యసంరక్షణ చర్యలు ః దోమ తరచుగా ఆశించే ప్రాంతాలలో తట్టుకోనే రకాలయిన ఎండివి 1010 ,ఎంటివి 1001 వంటి రకాలను సాగు చేయాలి. సిఫారసు చేసిన మేరకే నత్రజని ఎరువులను వాడాలి. సుడిదోమ ఆర్ధిక నష్టస్ధాయి పరిమితి పిలకదశలో 10.15దోమలు అంకురం నుండి ఈనిక దశల్లో 20.25 దోమలు గమనించినట్లయితే క్రింది మందులను పిచికారి చేయాలి. తొలుతగా విసిఫేట్ 1.5 గ్రా/లీటర్ నీటకి కలిపి పిచికారి చేయాలి. ఉదృతి అధికంగా గమనించినట్లయితే డైనోటెప్యూరాన్ 0.4 గ్రా/లీటర్ లేదా పైమెట్రోజెన్ 0.4గ్రా/ లీటర్ నీటికి కలిసి పిచికారి చేయాలి. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, యం.జగన్‌మోహన్‌రెడ్డి, కీటక శాస్త్రవేత్త, ప్రోగామ్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.

Mosquito bite prevention practices in Paddy