Friday, April 19, 2024

ఆగస్టులో అత్యధిక కేసులు..

- Advertisement -
- Advertisement -

Most Corona positive cases in August

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆగస్టు నెలలో కరోనా టెర్రర్ సృష్టించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం 1,24,963లో సగం కేసులు ఈనెలలోనే తేలడం గమనార్హం. మార్చి 2 తేది నుంచి జూలై 30 వరకు రాష్ట్రంలో 62,703 కేసులు తేలగా, అప్పట్నుంచి ఆగస్టు 30 వరకు 62,260 మందికి వైరస్ సోకింది. అంటే ఐదు నెలల్లో నమోదైన పాజిటివ్‌ల సంఖ్యను ఈ ఒక్క నెల రెట్టింపు చేయడం ఆందోళనకరం. జూలై చివరి వరకు కేవలం జిహెచ్‌ఎంసికే పరిమితమైన కేసులు, ఆగస్టు నుంచి జిల్లాలకు వ్యాప్తి చెందాయి. అన్‌లాక్ పీరియడ్‌లో ద్వితీయ శ్రేణి నగరాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగడం వలనే వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

3 రెట్లు రెట్టింపైన టెస్టులు…..

మార్చి నుంచి జూలై 30 వరకు రాష్ట్రంలో 4,37,582 మందికి పరీక్షలు నిర్వహించగా, అప్పట్నుంచి ఆగస్టు 30 వరకు ఏకంగా 13,65,582 మందికి టెస్టులు చేశారు. అంటే సుమారు 3 రెట్లుకు పైగా ఈ ఒక్క నెలలో పరీక్షలు చేయడం రికార్డు. జూలై చివరి వరకు 320 యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాలతో పాటు ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 23 ఆర్‌టిపిసిఆర్ విధానంలో ప్రతిరోజు సగటున 15వేల టెస్టులు చేసిన వైద్యశాఖ, ఆగస్టులో యాంటీజెన్ కేంద్రాలను 1076కి పెంచి విస్త్రృతంగా పరీక్షలు చేస్తుంది. దీంతో పాటు కంటైన్‌మెంట్ ఏరియాలో మొబైల్ వాహనాలతో కూడా ఆర్‌టిపిసిఆర్ విధానంలో టెస్టులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ సగటున 35వేలకు తగ్గకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్యశాఖ చెబుతోంది. రాబోయే రోజుల్లో ప్రతి పది లక్షల మందిలో 50వేల మందికి పరీక్షలు చేసేలా అన్ని సన్నాహాలు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ సంచాలకులు డా. జి శ్రీనివాసరావు తెలిపారు.

చికిత్స ప్రోటోకాల్‌ను మార్చిన ప్రభుత్వం…..

రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత వైద్యులెవ్వరికీ చికిత్స విధానంపై అంతా అవగాహన రాలేదు. కానీ ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సూచన మేరకు హైడ్రాక్సిక్లోరోక్వీన్, అజిత్రోమైసిన్, విటమిన్ ట్యాబ్లెట్లు, పారాసిటమాల్,లతో పాటు ఎయిడ్స్ లోడ్ తగ్గించే మొదటి డోస్ యంటీడ్రగ్స్ లొపినవీర్, రెపినవీర్ వంటి కాంబినేషన్ మందులను ప్రయోగిస్తూ వచ్చారు. కానీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో అమలవుతున్న చికిత్సను, వాడుతున్న మందులను నిపుణులు ద్వారా తెలుసుకొని ఆ చికిత్స విధానాన్ని కూడా ఇక్కడ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం డెక్సామిథసోన్, ఫావిపిరవిర్, ఫ్యాబిప్లూ వంటివి కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. వీటిని అన్ని పిహెచ్‌సి స్థాయిలో ఉంచామని హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. మరోవైపు కరోనాకి వైద్యం అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు ప్రతి సోమవారం చికిత్సవిధానంలో అవగాహన కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. వైరస్ తీవ్రతను బట్టి ఎవరికి ఏ మందులు వాడాలి? అనే వివరాలను వివరిస్తున్నామని డిహెచ్ అన్నారు.

జిహెచ్‌ఎంసిలో తగ్గిన కేసులు తీవ్రత…

వైరస్ వ్యాప్తి పెరిగి తగ్గిపోతుందని హెల్త్ డైరెక్టర్ అంచనా కరెక్ట్ అవుతోంది. అయితే జిహెచ్‌ఎంసి పరిధిలో ఆగస్టు చివరి వరకు, జిల్లాల్లో సెప్టెంబర్ చివరి కరోనా కంట్రోల్ అవుతోందని ఇటీవల హెల్త్ డైరెక్టర్ ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. ఈక్రమంలో అధికారిక లెక్కల ప్రకారం మాత్రం జిహెచ్‌ఎంసిలో కేసుల తీవ్రత కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది. కానీ సెప్టెంబర్ చివరిలో జిల్లాల్లో కేసులు తగ్గుతాయా? లేదా అనేది వేచిచూడాలి. మరోవైపు కరోనా కంట్రోల్ చేసేందుకు గ్రామస్థాయిలో ఉన్న పిహెచ్‌సిలో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచామని డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సెప్టెంబర్ చివరి వరకు జిల్లాల్లో వైరస్ ఖచ్చితంగా కాస్త తగ్గుతోందని ఆయన తెలిపారు. ఈమేరకు ప్రజలు మరిన్ని రోజులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News