Wednesday, April 24, 2024

అఖిల్ ఎన్నుకున్న కథ చాలా బాగుంది

- Advertisement -
- Advertisement -

Most Eligible Bachelor Success Celebrations

 

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో అల్లు అర్జున్, దర్శకుడు వంశీ పైడి పల్లి,దర్శకుడు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ “అఖిల్ చాలా బాగా డాన్స్ చేస్తాడు, బాగా ఫైట్స్ చేస్తాడు. ఇవన్నీ చేయగలిగి కూడా మంచి ఫ్యామిలీ సబ్జెక్టును సెలెక్ట్ చేసుకొని ఒక మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా చేశాడు.

తను ఎన్నుకున్న కథ చాలా బాగుంది. మంచి సినిమా తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని ఈ సినిమా నిరూపించింది”అని అన్నారు. చిత్ర దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ “ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా కుదిరింది. నాకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు”అని తెలిపారు. హీరో అఖిల్ మాట్లాడుతూ “ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడమే కాకుండా కొన్ని సమస్యలకు పరిష్కారాలను ఇద్దామనుకున్నాము. మేము అనుకున్న ఈ కథ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. మంచి సినిమాతో హిట్ కొట్టాము”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, పూజా హెగ్డే, బన్నీవాసు, వాసు వర్మ, గోపి సుందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News