Home తాజా వార్తలు చెర్లగూడెంలో తల్లీకూతుళ్ల బలవన్మరణం

చెర్లగూడెంలో తల్లీకూతుళ్ల బలవన్మరణం

Suicideసంగారెడ్డి: కంది మండలం చెర్లగూడెంలో తల్లీకూతుళ్లు ఉరేసుకుని బలవన్మరణం పొందారు. శనివారం అర్థరాత్రి ఇంట్లో ఉరేసుకుని గంగమ్మ(68), నాగమ్మ(40) అనే తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తెలిపారు. తల్లీకూతుళ్ల మృతితో చెర్లగూడెంలో విషాదం నెలకొంది. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం గంగమ్మ, నాగమ్మల మృతదేహాలను సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Mother And Daughter Commits Suicide In Cherlagudem