Home వనపర్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీకూతురు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి తల్లీకూతురు మృతి

Woman-Dies

రేవల్లి ః గోపాల్‌పేట మండల కేంద్రం సమీపంలో గల రెడ్లకుంటకు దుస్తులను శుభ్రం చేసేందుకు వెళ్లి తల్లి,కూతురు మృత్యువాత పడిన సంఘటన గోపాల్‌పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం .. మంగళవారం ఉదయం గోపాలపేట మండల కేంద్రానికి చెందిన మాణిక్యమ్మ (26),కూతురు రుక్మిణి (6) ఇద్దరు కలిసి దుస్తులను శుభ్రం చేసేందుకు మండల కేంద్రం సమీపంలో గల రెడ్లకుంటకు వెళ్లి దుస్తులను శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మాణిక్యమ్మ, కూతురు రుక్మిణిలు రెడ్లకుంటలో పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Mother And Daughter Dies After Falling In Pond