Home తాజా వార్తలు తల్లికూతురు అదృశ్యం

తల్లికూతురు అదృశ్యం

Mother and daughter Missing In Hyderabad

శేరిలింగంపల్లి : తల్లికూతురు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. శేరిలింగంపల్లి తారానగర్‌కు చెందిన రఘువీర్ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మానస (22)ను 2013వ సంవత్సరంలో రఘువీర్‌తో వివాహం జరిగింది. వీరిద్దరికి కూతురు వర్షిని (3) ఉంది. భార్య భర్తలిద్దరు తారానగర్‌లో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతున్నారు. గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవ జరుగుతున్నాయి. దాంతో వారి కుటుంబాలను పిలిపించి సర్ది చెప్పారు. అయిన కూడా వారిద్దరి మధ్య గొడవలు ఆగకపోవడంతో  మనస్తాపానికి గురైన మానస కూతురు వర్షిని తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్తున్నానని తన అన్న ఉడత శ్రీనివాస్‌కు తెలియజేసింది. వెంటనే శ్రీనివాస్ తారానగర్‌లోని వారి ఇంటికి చేరుకొని చూడగా మానస కూతురు వర్షిని కనబడలేదు. దీంతో చందానగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Mother and daughter Missing In Hyderabad