Home తాజా వార్తలు మనస్తాపంతో తల్లీ, కూతురు ఆత్మహత్య…

మనస్తాపంతో తల్లీ, కూతురు ఆత్మహత్య…

Suicide

 

కూకట్‌పల్లి : భర్తతో చిన్న పాటి తగాదాల కారణంగా మనస్తాపం చెందిన ఓ వివాహిత భవనంపై దూకి కూతురితో సహా ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘనట కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి బాలాజీనగర్‌కు చెందిన రామ్‌మూర్తి భార్య పద్మజ(33)కు భర్తకు జరిగితిన చిన్న పాటి గొడవతో మనస్తాపానికి చెందిన పద్మజ తన రెండు సంవత్సరాల కుమార్తె అక్షరతో కలిసి శనివారం రాత్రి తమ అపార్ట్‌మెంట్‌లోని 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన బంధువులు, చుట్టుపక్కల వారు సమీప ఆసుపత్రికి తరలించగా పద్మజ మృతి చెందగా, గాయాలపాలైన కూతురు అక్షరకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సిఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులూ దర్యాప్తు చేస్తున్నారు.

Mother and her Daughter commit Suicide