Home జగిత్యాల లారీ ఢీ : తల్లీకొడుకుల దుర్మరణం

లారీ ఢీ : తల్లీకొడుకుల దుర్మరణం

Road Accidentజగిత్యాల: మెట్‌పల్లి ఆర్ టిసి  బస్‌డిపో వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై బైక్ ను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గణేశ్, అతని తల్లి లక్ష్మీ ఘటనాస్థలిలోనే చనిపోయారు. గణేశ్, లక్ష్మీల మృతితో గుండంపల్లిలో విషాదం నెలకొంది. శవపరీక్ష కోసం గణేశ్, లక్ష్మీల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసలు తెలిపారు.

Mother And Son Dead In Road Accident At Jagtial