Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

Road Accidentమెదక్:  శివంపేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. అశోక్ అనే వ్యక్తి తన భార్య అనిత , కొడుకు దీక్షిత్ తో కలిసి చిన్న శంకరంపేట గ్రామానికి వెళ్తుతున్నాడు. ఈ క్రమంలో  వెనుక నుంచి వేగంగా  వచ్చిన లారీ అశోక్ బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో  అశోక్ భార్య అనిత, కొడుకు దీక్షిత్  ఘటనాస్థలిలోనే చనిపోయారు.  అశోక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అశోక్ ను ఆస్పత్రికి తరలించారు. బాధితులు సంగారెడ్డి జిల్లా, హత్నూర్ మండలం, సాదుల నగర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో సాదుల నగర్ గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం కోసం అనిత, దీక్షిత్ మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Mother And Son Dead In Road Accident At Medak