Tuesday, March 28, 2023

కరోనాతో తల్లీకుమారుడు మృతి

- Advertisement -

mother and son death with Covid 19 at narayankhed

సంగారెడ్డి: కరోనాతో తల్లీకుమారుడు మృతి చెందిన విషాద సంఘటన నారాయణఖేడ్ లో చోటుచేసుకుంది. కోవిడ్ తో ఇంట్లోనే చికిత్స పొందుతూ రాత్రి కుమారుడు, ఉదయం తల్లి మృతి చెందింది. కుటుంబంలోని మిగితా ఆరుగురు సభ్యులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎనిమిది మంది కుటుంబసభ్యులు ఒకే ఇంట్లో హోంఐసోలేషన్ లో ఉన్నారు. రాత్రి సోఫాలోనే కొడుకు కుప్పకూలి మరణించాడు. అయితే కుటుంబీకులు మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఉంచారు. అంత్యక్రియలకు బంధువులు, స్థానికులేవరు ముందుకు రాలేదు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో మృతదేహాలను మధ్యాహ్నం వరకు బైటనే ఉంచారు. కోవిడ్ నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బంది వర్షం తగ్గాక మృతదేహాలను అంత్యక్రియలకు తరలించారు. అనంతరం సిబ్బంది కాలనీ పరిసరాల్లో శానిటైజ్ చేశారు.

mother and son death with Covid 19 at narayankhed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News