Home ఆంధ్రప్రదేశ్ వార్తలు కాల్వలోకి దూసుకెళ్లిన కారు : తల్లీకొడుకు మృతి

కాల్వలోకి దూసుకెళ్లిన కారు : తల్లీకొడుకు మృతి

Mother And Son Died With Car Drown In Canalఅమరావతి : వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో తల్లీకొడుకు చనిపోయారు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అవనిగడ్డకు చెందిన కిరణ్ కుమార్ తన కుటుంబంతో కలిసి కారులో గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక గ్రామానికి వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు అవనిగడ్డ – విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కిరణ్ కుమార్, అతడి 11 నెలల కొడుకు సురక్షితంగా బయటపడ్డారు. అయితే కిరణ్ కుమార్ బార్య దుర్గా మహాలక్ష్మి(32), కొడుకు శ్రీమంత్(6)లు చనిపోయారు. దీంతో కిరణ్ కుమార్ కుటుంబంలో విషాదం అలుముకుంది. గాయపడిన కిరణ్ కుమార్ ను, చిన్నారిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం దుర్గా మహాలక్ష్మి, శ్రీమంత్ మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.