Saturday, November 2, 2024

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

Mother And Son Killed in Road Accident in Dornakal

డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ దగ్గర శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తల్లీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రెండు వాహనాలు వేగంగా వచ్చి అదుపుతప్పడంతోనే ఈ  ప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు.

Mother And Son Killed in Road Accident in Dornakal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News