కుటుంబ కలహాలతో చెరువులో దూకి
బలవన్మరణం జోగులాంబ గద్వాల జిల్లా
మల్లాపూర్ గ్రామంలో విషాదం
సంపు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
నాగర్కర్నూల్ జిల్లా గడ్డంపల్లిలో జరిగిన ఘటనపై అనుమానాలు
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధిః ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం రెండు వేర్వేరు ఘటనలలో ఐదు గురు చిన్నారులు, తల్లి మృతి చెందారు. ఇందుకు సంబంధిం చిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండల పరిధిలోని గడ్డంపల్లి గ్రామంలో మంగళవారం సంపు గుంతలో పడి ఇద్దరు చిన్నారులు అనుమానస్పందంగా మృతి చెం దారు. గ్రామస్థుల కథనం ప్రకారం గడ్డంపల్లి గ్రామానికి చెందిన తల్పునూరు నరసింహా,భార్య లక్ష్మమ్మ ఇద్దరు గొడవ పడడంతో లక్ష్మమ్మ తన ఇద్దరి పిల్లలతో తన తల్లిగారి ఊరు అయినా పెద్దాపూర్ గ్రామానికి వెళ్ళింది. భర్త నరసింహా మూడురోజుల క్రితం పెద్దాపూర్ గ్రామానికి వెళ్ళి ఇద్దరు చిన్నారులు కిట్టు (5), అమ్ములు (3)లను గడ్డంపల్లి గ్రామానికి తీసుకొచ్చారు. మంగళవారం సుమారు 4 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఆడుకుంటూ సంపు గుంతలో పడి మర ణించారు. సంఘటన స్థలానికి సిఐ గాంధీనాయక్, ఎస్సై విజయ్ కుమా ర్లు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కేటిదొడ్డిలో …
గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చెట్ల మల్లాపూర్ గ్రామంలో కుటంబ కలహాలతో తన ముగ్గురు పిల్లతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామంలోని చెరువులో తన ముగ్గురు పిల్లలు నందిని (10), శివాని (4), బుజ్జి (01)లతో సహా తల్లి సత్యమ్మ (32) ఆత్మహత్యకు పాల్పడింది. భర్త బాషాతో కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. ఈ ఘటన పై పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.