Home Default తల్లిని చంపేశారు.. పిల్లలపై జాలి చూపారు!

తల్లిని చంపేశారు.. పిల్లలపై జాలి చూపారు!

snakes-1

చిత్తూరు: తన కొడుకులు, కూతుళ్ల ముందు తల్లినో తండ్రినో ఎవరైనా కొడుతుంటే ఊరుకుంటారా? అస్సలూరుకోరు. ప్రత్యర్థిని చితగ్గొట్టేస్తారు. అలాంటి సంఘటనే జరిగింది చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం దిన్నిపల్లెలో. అయితే ఇది పాము దాని పిల్లల దీనగాథ. రెడ్డెప్ప అనే రైతుకు చెందిన మామిడితోటకు పొరుగునే ఉన్న బ్రాహ్మణపల్లెకు చెందిన పెద్దప్ప కావలికారుగా ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తోటలో నడుస్తుండగా పెద్దప్పకు ఓ నాగు పాము కనిపించింది. కాటేసేందుకు పడగ విప్పింది. దీంతో అక్కడి కూలీలంతా కలిసి పామును చంపేశారు.

అంతలోనే ప్రక్కనే ఉన్న ఎలుకల బొరియల్లో నుండి దాదాపు 25 పాము పిల్లలు బయటికి వచ్చాయి. చనిపోయిన తల్లి పాము చుట్టూ పడగ విప్పి సంచరించాయి. కొద్ది దూరం అటూఇటు సంచరించిన పిల్లలు తిరిగి చనిపోయిన తల్లి దగ్గరకు రావడం విశేషం. ఇది చూసిన కూలీలు తల్లి పాము చనిపోవడంతో పిల్లల పట్ల జాలి చూపించి వాటిని చంపకుండా వదిలేశారు.