Home తాజా వార్తలు మూడేళ్ల కొడుకును హత్య చేసి.. తల్లి ఆత్మహత్య

మూడేళ్ల కొడుకును హత్య చేసి.. తల్లి ఆత్మహత్య

Mother killed son at lb nagar

హైదరాబాద్: నగరంలోని ఎల్ బి నగర్ శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకును హత్య చేసింది ఓ తల్లి. అనంతరం తాము ఉంటున్న మూడో అంతస్తుపై నుంచి దూకింది. తీవ్ర గాయాలపాలైన ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచింది. భర్త వేధింపుల వల్లే ఆమె ఈ దారుణానికి పాల్పడిందని మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. స్థానికుల సమచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మమత స్వస్థలం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని‌ పోలీసులు అనుమానిస్తున్నారు.

Mother killed son at lb nagar