Home తాజా వార్తలు నిజామాబాద్ లో తల్లిని చంపిన కొడుకు

నిజామాబాద్ లో తల్లిని చంపిన కొడుకు

Mother Murder By Son In Nizamabadనిజామాబాద్‌ : ఎడపల్లి మండల పరిధిలోని ఈఆర్పీ క్యాంప్ గ్రామంలో సోమవారం ఉదయం తల్లిని ఆమె కొడుకు దారుణంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన కొమరవ్వ (52) అనే మహిళను ఆమె కొడుకు శ్రీనివాస్ రోకలి బండతో తలపై మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొమరవ్వకు బోదన్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా తల్లి కొమరవ్వను చంపి ఉండొచ్చని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం కొమరవ్వ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.