Home జయశంకర్ భూపాలపల్లి తాగిన మైకంలో…

తాగిన మైకంలో…

Murderములుగు : తాగిన మైకంలో ఓ యువకుడు తన కన్నతల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన వెంకటాపూర్ మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గొర్రె సుశీల (50)తో ఆమె కొడుకు వేణు కొంతకాలంగా గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తాగొచ్చిన వేణు సుశీలను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. శవ పరీక్ష కోసం సుశీల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Mother Murder By Son In Venkatapur At Mulugu