Friday, January 27, 2023

కూతుర్ని సజీవదహనం చేసిన తల్లికి మరణశిక్ష!

- Advertisement -

DEATHఇస్లామాబాద్ : తన పరువు కోసం కన్నకూతురని కూడా చూడకండా సజీవ దహనం చేసిన ఓ మహిళకు కోర్టు మరణశిక్ష విధించింది. ‘పరువుహత్య’ కేసుల్లో దోషులకు కఠినశిక్షలు విధించేందుకు కొత్త చట్టాన్ని పార్లమెంట్ ఆమెదించిన కొద్ది నెలల తర్వాత న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందని కుమార్తె జీనత్ రఫీక్ (18)ను ఆమె తల్లి పర్వీన్ బీబీ నిప్పంటించి హతమార్చింది. తన కుటుంబానికి తలవంపులు తెచ్చిందనే కూతుర్ని చంపినట్లు పర్వీన్ కోర్టులో ఒప్పుకుంది. కొడుకు అనీస్ సాయంతో కూతుర్ని చంపినట్లు పోలీసు విచారణలో తేలింది. దీంతో ఈ కేసులోని వాదనలు విన్న ఎటిసి కోర్టు న్యాయమూర్తి ఆజామ్ చౌధురి పర్వీన్‌కు మరణ శిక్ష, అనీస్‌కు జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles