Home తాజా వార్తలు బీరు సీసాతో పొడిచి.. ఇద్దరు కొడుకులను హతమార్చిన తల్లి…

బీరు సీసాతో పొడిచి.. ఇద్దరు కొడుకులను హతమార్చిన తల్లి…

 Mother

 

సిద్దిపేట : ఒక తల్లి ఐదేళ్లు, రెండేళ్ల వయసులోని ఇద్దరు కుమారులను బీరు సీసాతో పొడిచి చంపివేసిన దారుణం సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌నగర్‌లో శనివారం నాడు సంభవించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన చిట్యాల భాస్కర్, కోరుట్ల జిల్లా కట్లాపూర్ మండలం కాకలపల్లి గ్రామానికి చెందిన సరోజ ఆరు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక సంవత్స రం నుంచి పట్ట ణంలోని గణేష్‌నగర్‌లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి అయాన్ (5), హర్షవర్ధన్(2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త భాస్కర్ శనివారం ఉదయం ఇంటి నుండి వెళ్లగానే సరోజ తన ఇద్దరు కుమారులను ఇంట్లోనే బీరు సీసాతో పొడిచి హతమార్చింది. అనంతరం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ పోలీసు స్టేషన్‌లోనికి వెళ్లి లొంగిపోగా అక్కడి పోలీసులు సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సిఐ నందీశ్వర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని చూడగా ఇద్దరు చిన్నారులు శవాలై కనిపించారు. అనంతరం అడిషనల్ డిసిసి గోవిందు నర్సింహారెడ్డి, ఎసిపి రామేశ్వ ర్‌లు అక్కడికి చేరుకొని క్లూస్ టీమ్ ద్వారా హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ఫోన్ ద్వారా భాస్కర్‌కు తెలియజేశారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న భాస్కర్ తన ఇద్దరు కుమారుల మృతదేహాలను చూసి బోరున విలపించాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురికి తరలించారు.

 

Mother who Killed Two Sons