Home హైదరాబాద్ మూడేళ్ల కుమారుడితో తల్లి అదృశ్యం

మూడేళ్ల కుమారుడితో తల్లి అదృశ్యం

Mother with three-year-children missing

హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రం షాపూర్‌కురుడు ప్రాంతానికి చెందిన మహమ్మద్ నజీర్ హుస్సేన్, అఫ్సనా కాటున్ (28) దంపతులకు మూడేళ్ల కుమారుడు ఇమ్రాన్ ఉన్నాడు. గండిమైసమ్మ మండలం కొంపల్లి గ్రామంలో నివాసం ఉంటూ.. నజీర్ హుస్సేన్ జాతీయ రహదారి పక్కన పంచార్ లు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆగస్టు 14న రోజు మాదిరిగా పని చేసుకుని ఇంటికి వచ్చిన నజీర్ హుస్సేన్ కు భార్య, కుమారుడు కనిపించకపోవడంతో తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపోయింది. దీంతో నజీర్ హుస్సేన్ శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఉన్న 10 వేల రూపాయాలతో పాటు దుస్తులు తీసుకొని వెళ్ళినట్లు ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.