Home తాజా వార్తలు కడసారి తల్లి మృతదేహాన్ని చూడటానికి అనుమతి ఇప్పించండి

కడసారి తల్లి మృతదేహాన్ని చూడటానికి అనుమతి ఇప్పించండి

Minister KTR

 

హైదరాబాద్: పలు రాష్ట్రాల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు తమ వారికి సాయం చేయాలంటూ మంత్రి కెటిఆర్‌కు ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వారి ట్వీట్లకు వెంటనే కెటిఆర్ సమాధానం ఇస్తూ వారు చేసిన విజ్ఞప్తులపై చర్యలు తీసుకోవాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదివారం పలువురు మంత్రి కెటిఆర్‌ను సాయం కోరుతూ ట్వీట్ చేశారు. ఈ కోవలోనే… తన తల్లి చనిపోయింది, చివరి చూపు చూసుకోవడానికి అనుమతి కావాలంటూ ఓ ప్రిన్సిపాల్ చేసిన విజ్ఞప్తికి మంత్రి కెటిఆర్ వెంటనే స్పందించారు. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి మంత్రి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని ఓ కళాశాలలో తెలంగాణకు చెందిన వ్యక్తి ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం తన తల్లి చనిపోయిందని, ఆమె చివరి చూపు దక్కించుకోవాలంటే తనను తెలంగాణలోకి వచ్చేలా అనుమతించాలని, లాక్‌డౌన్ నేపథ్యంలో తన ప్రయాణానికి ఎవరూ ఆటంకం కల్గించకుండా ఉండేలా చూడాలని మంత్రి కెటిఆర్‌కు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన కెటిఆర్, సదరు ప్రిన్సిపల్ తల్లి మృతిపై విచారం వ్యక్తం చేయడంతో పాటు ఆ ప్రిన్సిపల్‌ని రాష్ట్రంలోకి అనుమతించేలా వెంటనే చర్యలు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఉన్న జనతా మహా విద్యాలయంలో ప్రిన్సిపాల్‌గా డాక్టరు సుభాష్ పనిచేస్తున్నారు.

Mother would die tweet to Minister KTR