Home తాజా వార్తలు పది దాటితే… పరుగే..!

పది దాటితే… పరుగే..!

Motorists

 

రాత్రి పది దాటిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోని ప్రయాణికులు
ఎవరూ చూస్తలేరని జంక్షన్ల వద్ద జంప్
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
రాత్రి, పగలు నిబంధనలు పాటించాల్సిందే
ట్రాఫిక్ పోలీసులు

రాత్రి సమయంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. రాత్రి పది గంటలు దాటితే చాలు చాలా సిగ్నల్స్ వద్ద ఈ పరిస్థితి నెలకొంటోంది. ఆ సమయంలో పోలీసులు ఉండరనే ధీమాతో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు వాహనదారులు. పోలీసులు అక్కడ ఉన్నా.. లేకున్నా.. ట్రాఫిక్ నిబం ధనలు పాటించాల్సిందే. కాని వాహనదారులు రాత్రి సమ యంలో తమను ఎవరూ చూడటంలేదని నిబం ధనలు పట్టించుకోవడం లేదు.

హైదరాబాద్ : హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లలోని పలు సిగ్నల్స్‌ను వాహనదారులు రాత్రి 10 తర్వాత పట్టించుకోవడం లేదు. రాత్రి అయినా పగలైనా ట్రా ఫిక్ నిబంధనలు పాటించాల్సిందే కాని వాహనదారులు పోలీసులు ఉంటేనే పాటిస్తాం లేకుంటే పాటించం అన్న తీరుగా ఉంది.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ పోలీసులు ఉన్న లేకున్నా నిబంధనలు మారవని అందరూ పాటించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇంతమందికి ట్రాఫిక్ పోలీసులు ఉండాలనే నియమం ఇ ప్పటి వరకు లేదు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లను ఏర్పాట య్యే విధంగా చేయాలని పోలీసులు చూస్తున్నారు. కొన్ని జంక్షన్లలో సిగ్నల్స్ సరిగా పనిచేయకపోవడంతో, దానిని కూడా వాహనదారు లు తమకు అనుకూలంగా మార్చుకుని సిగ్నల్స్‌ను జంప్ చేస్తున్నా రు. రాత్రి సమయంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రమే పెట్రోలింగ్ చేస్తారు. ట్రాఫిక్ పోలీసులు పగటి సమయంలోనే విధులు ని ర్వర్తిస్తారు. వాహనదారులు రాత్రి సమయంలో సిగ్నల్స్‌ను ఫాలో అ వుతున్నారా లేదా అని లా అండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోరు.

దీ నిని కూడా వాహనదారులు అలుసుగా తీసుకుని సిగ్నల్స్ జంప్ చే స్తున్నారు. ఈ పరిస్థితి మూడు కమిషనరేట్ల పరిధిలో ఉంది. దాదాపుగా అన్ని సిగ్నల్స్‌ను పోలీసులు 24గంటలు పనిచేసే విధంగా చూ స్తున్నారు. రాత్రి సమయంలో తక్కువగా ట్రాఫిక్ ఉండే జంక్షన్ల వద్ద మాత్రమే సిగ్నల్స్ ఆపి వేస్తున్నారు. ఇక్కడ కూడా పోలీసులు వాహనదారులు గమనించే విధంగా ఎల్లో, రెడ్ లైట్లను మొత్తం ఆపివేయకుండా బ్లింక్ అయే విధంగా ఏర్పాట్లు చేశారు. దీని అర్ధం వాహనదారులు మిగతా దిక్కుల నుంచి వచ్చే వాహనాలను చూసి వెళ్లాలని. ఇలా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.

ట్రాఫిక్‌ను బట్టి సిగ్నల్స్ బంద్…
ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ పరిధిలో ఉన్న సిగ్నల్స్‌ను ట్రాఫిక్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగులు 24గంటలు పనిచేస్తుండడంతో ఇక్కడ నిరంతరం సిగ్నల్స్ పనిచేస్తుంటా యి. కాని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్‌కు అనుగుణంగా వా టిని నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండ ని ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఆపివేస్తున్నారు. అంత గా ట్రాఫిక్ లేనప్పుడు వాటిని ఆన్‌లో ఉంచడం వల్ల ఉపయోగం లేదని, వాహనదారుల సౌలభ్యం కోసం దీనిని పాటిస్తున్నారు. ఇక్క డ వాహనదారులు నాలుగు వైపులా ట్రాఫిక్‌ను చూసి వెళ్లవచ్చు. అ యితే సిగ్నల్స్ పనిచేస్తున్న జంక్షన్ల వద్ద వాహనదారులు ట్రాఫిక్ లేద నే సాకుతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. రెడ్ లైట్ వెలుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాహనాలను ముందుకు తీసుకువెళ్తున్నా రు. దీంతో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి.

ఎప్పుడైనా నిబంధనలు పాటించాలి
ఎస్‌ఎం విజయ్‌కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి
వాహనదారులు నిబంధనలు పాటించాల్సిందే, వాటికి రాత్రి, పగలు అనే తేడా లేదు సిగ్నల్స్ జంప్ చేసి వారు జరిమానాలు చెల్లించాల్సిందేనని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. చాలామంది వాహనదారులు రాత్రి సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలేదు, సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి వారిపై కూడా జరిమానాలు విధిస్తాం అని స్పష్టం చేశారు. సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే రోడ్డు ప్రమాదాలు జరగుతాయని అన్నారు.

Motorists do not follow traffic rules at night