సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోటో ఇ7 పవర్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసేందుకు మోటరోలా సిద్ధమైంది. ఈ కొత్త ఫోన్ ఆన్లైన్ మార్కెట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రూ.10 వేల సెగ్మెంట్లో అద్భుతమైన 5000 ఎంఎహెచ్, 4 జిబి + 64 జిబి స్టోరేజ్, 6.5 మ్యాక్స్ విజన్ హెచ్డి + డిస్ప్లే వంటివి లభిస్తాయి. రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. భారతదేశంలోనే 100 శాతం తయారైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా అద్భుతమైన ఫీచర్స్‌ని అందరికి అందించడమే కాకుండా అతి తక్కువ ధరలో భారతీయ ప్రజల అవసరాలను తీర్చడానికి ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూపొందించారు. ఫోన్ ధర (4జిబి + 64జిబి స్టోరేజ్) రూ. 8,299, (2జిబి + 32జిబి స్టోరేజ్) కేవలం రూ. 7,499 లభించనుంది. ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 12:00 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్, అలాగే రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది.