Home టెక్ ట్రెండ్స్ మోటరోలా నూత‌న స్మార్ట్‌ఫోన్‌ విడుదల…

మోటరోలా నూత‌న స్మార్ట్‌ఫోన్‌ విడుదల…

Motorolaముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు మోటరోలా త‌న కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘వ‌న్ విజన్‌’ను భారత మార్కెట్ లో గురువారం విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 19,999ల ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులో  సినిమా విజన్‌ డిస్‌ప్లే, నైట్‌ విజన్‌ ఫీచర్లతో 48, 5 మెగా పిక్సెల్‌ సామర్ధ్యం గల  డబుల్‌  కెమెరా ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోన్ లో అమర్చారు.

మోటరోలా వ‌న్ విజ‌న్ అద్భుత ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ డిస్‌ప్లే,

శాంసంగ్‌ ఎగ్జినోస్ 9609 ఆక్టాకోర్‌ ప్రాసెస‌ర్‌,

ఆండ్రాయిడ్ 9.0 పై

1080 x 2520  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌4 జిబి ర్యామ్‌,

128 జిబి స్టోరేజ్‌, 48+5 ఎంపి  డబుల్‌ రియర్‌  కెమెరా,

25 ఎంపీ సెల్ఫీ కెమెరా,3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ పోన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

Motorola One Vision With Hole Punch Display