Home టెక్ ట్రెండ్స్ మోటరోలా నుంచి మరో అద్భుత స్మార్ట్‌ఫోన్‌

మోటరోలా నుంచి మరో అద్భుత స్మార్ట్‌ఫోన్‌

Motorola upcoming smartphone launches on lines of redmi, realmi

 

ముంబయి: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుంది. రెడ్‌మి, రియల్‌మి తరహాలో 108 మెగా పిక్సెల్ భారీ రియర్ కెమెరాతో ఫోన్‌ను లాంచ్ చేయాలని యోచిస్తోంది. జి సిరీస్‌లో భాగంగా జి 60 పేరుతో ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లతో ఆవిష్కరించనుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్,120 హెర్ట్ డిస్‌ప్లేతో పాటుగా డ్యుయెల్ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా రానుందని అంచనా. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బిఐఎస్), ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సిసి)నుంచి ధ్రువీకరణ లభించిన అనంతరం ఈ ఫోన్‌ను భారత దేశంలో లాంచ్ చేస్తారని తెలుస్తోంది.

870 చిప్‌సెట్‌తో కూడిన మరో మోటరోలా ఫోన్ ఇది కావచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే జి సిరీస్‌లో మోటో జి100ను మార్చి 25న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే పలు ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 11,6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజి,108 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ఐసోసెల్ హెచ్‌ఎం 2ప్రైమరీ సెన్సార్,16ఎంపి, 8ఎంపి సెన్సార్, 2 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్‌లెన్స్, 36+16 ఎంపి డ్యుయెల్ సెల్ఫీ కెమెరా,6000 ఎంఎహెచ్ బ్యాటరీ మోటో జి60 ఫీచర్లు గా ఉంటాయని తెలుస్తోంది.

Motorola upcoming smartphone launches on lines of redmi, realmi