సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం నగరంలోని ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకుని దర్శకుడు రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిశర్మ, గుణశేఖర్ లు సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఇక, తనికెళ్ల భరణి, సిరివెన్నెల పార్థివదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. ఈరోజు ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించారు.
Movie celebrities pay tribute to sirivennela